Janmashtami 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక పండుగల నాడు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి ఇలా వీటికి చాలా ప్రాశస్త్యత ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణ జన్మాష్టమి సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో అంటే సెప్టెంబర్ 7న కృష్ణుడి పుట్టినరోజు వేడుక ఉంది. ఈ రోజున నెమలి పింఛంతో కొన్ని ఉపాయాలు ఆచరిస్తే ఆ ఇంట్లో ఆర్ధకి కష్టాలు దూరమౌతాయి. ఆ వ్యక్తి అదృష్టం మెరిసిపోనుంది. ప్రతి యేటా భాద్రపద మాసంలో కృష్ణ పక్షం అష్టమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఈసారి కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7న వచ్చింది. హిందూమతం ప్రకారం విష్ణు భగవానుడే భూమిపై కృష్ణుడిగా అవతరించాడని ప్రతీతి. ఈ అవతారంలో మురళి, పింఛం అనేవి కృష్ణుడి ప్రత్యేక ఆభరణాలు. ఆవే గుర్తింపు కూడా. జన్మాష్టమి రోజున నెమలి పింఛంతో కూడిన 3 ప్రత్యేక చిట్కాలు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా అంతులేని ధన సంపదలు అందిస్తుంది. 


చాలామంది ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. శ్రీ కృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా వరుసగా 21 రోజులు అంటే మూడు వారాల పాటు నెమలి పింఛాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచి పూజించాలి. 21వ రోజున ఆ నెమలి పింఛాన్ని ఇంట్లో ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అంతులేని ధనం లభిస్తుంది. ఆర్ధికంగా మంచి స్ఠితిలో ఉంటారు. 


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాస్తు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఇంటికి వాస్తు దోషం ఉండే అవకాశాలుంటాయి. వాస్తుదోషముండే ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయంటారు. ఫలితంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరిపై ఈ ప్రభావం పడుతుంది. ఈ కష్టాల్ని దూరం చేసేందుకు  శ్రీ కృష్ణ జన్మాష్టమి మంచి అవకాశం. ఈ రోజున ఇంట్లో నెమలి పింఛాన్ని కృష్ణుడితోపాటు ఉంచి పూజలు చేయాలి. నెమలి పింఛాన్ని ఇంట్లో తూర్పు దిశలోనే అమర్చాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి ఉన్న వాస్తుదోషం పోతుంది.


కొంతమందికి జీవితంలో ఆటంకాలు ఎక్కువగా ఎదురౌతుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు, అవరోధం కలుగుతుంటుంది. మీ జాతకం కుండలిలో రాహు కేతువుల దోషం దీనికి కారణం కావచ్చంటున్నారు జ్యోతిష్య  పండితులు. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు జన్మాష్టమి రోజున నెమలి పింఛాన్ని మీ బెడ్రూం పశ్చిమ దిశలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల దుష్ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.


Also read: Bathing in Deoria Pond: ఈ చెరువులో స్నానాలు చేస్తే రోగాలు ఇట్టే పోతాయట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook