Janmashtami 2022: హిందూమతంలో జన్మాష్టమి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతియేటా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిధి నాడు జన్మాష్టమి జరుపుకుంటారు. ఆ రోజున శ్రీకృష్ణుని విధి విధానాలతో పూజిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతియేటా భాద్రపదంలో కృష్ణపక్షం అష్టమి రోజున శ్రీ కృష్ణుడి జన్మదినం. ఆ రోజే జన్మాష్టమి పండుగ. ఈసారి జన్మాష్టమి ఆగస్టు 18, గురువారం నాడు వస్తోంది. శ్రీ కృష్ణుడి జన్మం అష్టమితో పాటు రోహిణి నక్షత్రంలో జరిగింది. ఈసారి జన్మాష్టమి నాడు వృద్ధి యోగం ఉంది. దీన్ని శుభ ఫలదాయకంగా భావిస్తారు. జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడి బాలరూపాన్ని పూజిస్తారు. దేశవ్యాప్తంగా జన్మాష్టమి పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి చోటా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటింటా గోపాలుడిని ఊయలలో తిప్పుతారు. ఈసారి జన్మాష్టమి తిధి, శుభ ముహూర్తం, సరైన పూజా విధానం గురించి తెలుసుకుందాం..


శ్రీ కృష్ణుడి పుట్టిన రోజు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తారు. జన్మాష్టమి ఏర్పాట్లు నాలుగైదు రోజుల ముందు నుంచే చేస్తుంటారు. ఈసారి జన్మాష్టమి ఆగస్టు 18వ తేదీ గురువారం నాడొచ్చింది. అష్టమి తిధి ప్రారంభం ఆగస్టు 18వ తేదీ సాయంత్రం 9 గంటల 21 నిమిషాలకు ప్రారభమై..19 తేదీ రాత్రి 10 గంటల 59 నిమిషాల వరకూ ఉంటుంది. అందుకే ఆగస్టు 18వ తేదీనే జన్మాష్టమి జరుపుకుంటారు. 


ఆ రోజున అత్యంత మంచి ముహూర్తం 12 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై..12 గంటల 56 నిమిషాల వరకూ ఉంటుంది. అటు విద్ధి యోగం ఆగస్టు 17 ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 18 వతేదీ రాత్రి 8 గంటల 41 నిమిషాలవరకూ ఉంటుంది. జన్మాష్టమి రోజున రాహుకాలం ఆగస్టు 18 మద్యాహ్నం 2 గంటల 6 నిమిషాలకు ప్రారంభమై..3 గంటల 42 నిమిషాలవరకూ ఉంటుంది. ఈ సమయంలో ఏ విధమైన శుభకార్యం జరపకూడదంటున్నారు. 


జన్మాష్టమి రోజు రాత్రి 12 గంటలకు శ్రీ కృష్ణుడు జన్మించారు. ఈ రోజు శ్రీ కృష్ణుడిని పాలు, గంగాజలంతో స్నానం చేయిస్తారు. ఆ తరువాత కొత్త వస్త్రాలు ధరింపజేసి..నెమలి పింఛం, వేణు, ముకుటం, చందనం, వైజయంతీ మాల, తులసీదళం, వంటివాటితో అలంకరిస్తారు. ఆ తరువాత పువ్వులు, పండ్లు, వెన్న, పటికబెల్లం, స్వీట్స్ వంటివి అర్పిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుడి చెంతన దీపం ధూపం పెడతారు. చివర్లో శ్రీ కృష్ణుడిని బాల రూపంలో ఆరతి ఇచ్చి..ప్రసాదం పంచిపెడతారు. 


Also read: Samudrika Shastram: ముక్కుపై మొటిమ ఉండే మహిళ భార్యగా వస్తే..ఇక డబ్బే డబ్బు, అష్ట ఐశ్వర్యాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook