COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ 17 బుధవారం చైత్రమాసంలోని శుక్లపక్షం నవమి తిథి. అలాగే ఈ రాముడి జన్మించిన రోజు కాబట్టి శ్రీరామనవమిగా కూడా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చంద్ర గ్రహం ఈరోజు తన సొంత రాశి అయిన కర్కాటక రాశిలో బృహస్పతి గ్రహం మేషరాశిలో ఉండబోతోంది. ఈ రెండు గ్రహాలకు కేంద్ర గృహం ఆయా రాశులు.. కాబట్టి ఈ నవమి చాలా శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం కూడా ఏర్పడబోతోంది. దీంతోపాటు రవి యోగంతో ఆశ్లేష నక్షత్రం సంయోగం జరగబోతోంది.  దీని కారణంగా శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో ఇప్పుడే తెలుసుకోండి.


మేష రాశి:
ఏప్రిల్ 17న మేష రాశి వారికి చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈరోజు శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంటర్వ్యూలకు అటెండ్ అయినవారు మంచి కంపెనీలలో జాబ్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు మంచి మంచి వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో వస్తున్న అడ్డంకులన్నీ ఈరోజు తొలగిపోబోతున్నాయి. అలాగే వీరు మతపరమైన ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయి క్రమశిక్షణతో ఉండడం వల్ల సమాజంలో కూడా మంచి పేరు పొందుతారు. దీంతో పాటు పిల్లలతో కలిసి చిన్న చిన్న ప్రదేశాలకు విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో దూరమవుతాయి.


కర్కాటక రాశి:
ఏప్రిల్ 17వ తేదీన ఏర్పడబోయే గజకేసరి యోగం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఎలాంటి సవాళ్లు వచ్చినా ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి శ్రీరాముడి అనుగ్రహంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈరోజు నుంచి పురోగతి పొందుతారు. ఈరోజు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనేందుకు కొత్త దుస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పూజల్లో పాల్గొనడం కారణంగా మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే తోబుట్టులతో కలిసి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంటారు. కొత్తగా పెళ్లయిన వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.


మకర రాశి:
మకర రాశి ఏప్రిల్ 17 ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు బాధ పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే స్నేహితులతో కలిసి దేవాలయాలు సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా గడిపేందుకు సమయం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మీన రాశి:
మీన రాశి వారికి కూడా శ్రీరామనవమి రోజు చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ప్రత్యర్థులపై జయం సాధించడానికి గొప్ప సమయం గా పరిగణించవచ్చు. అలాగే ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి కఠిన తరమైన పనులైన ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉండబోతోంది. అలాగే వీరు కొత్త కొత్త శుభవార్తలు కూడా వింటారు ఇక వ్యాపారాలు చేసేవారు ఈరోజు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే వీరికి ఈరోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా మారుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో శుభ్రంగా ఉండబోతోంది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ దీనిని సమర్థించదు.)


 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి