Hindu Mythological Reason Behind Lord Seetha Rama kalyanam: దేశంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. చాలా మంది ఉగాది నుంచే శ్రీరామనవమి ఎప్పుడోస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రామయ్య శోభాయాత్ర, రామయ్య పుట్టిన రోజు వేడుకలు, సీతారమ కళ్యాణం ఎప్పుడెప్పుడు చేయాలని ఎదురుచూస్తుంటారు. శ్రీరాముడు చైత్రశుధ్ద నవమి, పునర్వసు నక్షత్రంలో ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు జన్మించాడు. అదే విధంగా శ్రీరాముడి మానవ అవతారం ధరించి, మానవుల మాదిరిగానే సాధారణ జీవనంసాగించాడు. అనేక కష్టాలను భరించాడు. ఒకవైపు రాజ్యపట్టాభిషేకం అన్న మరునాడే తండ్రి మాట కోసం అరణ్యాల బాటపట్టాడు. తండ్రి ఇచ్చిన మాటలను గౌరవించి అడవులకు వెళ్లాడు. రామయ్య వెంట లక్ష్మణుడు, సీతమ్మకూడా వెళ్లారు. ఆతర్వాత రావణుడు సీతమ్మతల్లిని అపహారించాడు. ఆ తర్వాత హనుమ సహాయంలో లంకకు వారధికట్టి రావణుడితో యుధ్దం చేసి సీతమ్మను తిరిగి తన రాజ్యానికి తెచ్చుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More:Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?


ఇక శ్రీరామనవమి రోజు చాలా చోట్ల ప్రత్యేకంగా కళ్యాణాలను జరిపిస్తుంటారు. దీనివెనుక ఆగమ శాస్త్రం ప్రకారంకొన్ని కారణాలు ఉన్నాయి. మొదట భద్రాచలం రామయ్య భక్తుడు కంచర్ల గోపన్న రామయ్యకు తన ఆస్తినంతా కైంకర్యం చేశాడంట. ఆ తర్వాత భద్రాచంలో ఉత్సవ మూర్తులకు కళ్యాణం చేయించాడంటా. అప్పటి నుంచే ఇదే ఆచారం తరతరాలుగా అందరు పాటిస్తు వస్తున్నారు. అదే విధంగా.. దేవలయాలు, బ్రహ్మోత్సవాలు, విగ్రహాల ప్రతిష్టాపనలు వంటి పుణ్య కార్యక్రమాల సమయంలో ఉత్సవవిగ్రహాలకు కళ్యాణం చేయిస్తారు.


అదే విధంగా కళ్యాణంలో మాంగళ్యం తంతునాణేనా.. లోక రక్షణ హేతునా.. అని పూజారులు మంత్రాలను పఠిస్తారు. ఈ సమస్తమైన లోకాలను కాపాడటానికి దేవ దేవుడి కళ్యాణం జరిపిస్తారు. కొందరుమనస్సులోని కోరికలునెరవేరితే కళ్యాణం జరిపిస్తామని చెబుతుంటారు. అందుకే.. ఇప్పటికి కూడా ఇదే ఆచారం పాటిస్తు వస్తున్నారు. అందుకే శ్రీరామ నవమి రోజున ప్రతి గుడిలో, వీధుల్లో ప్రత్యేకంగా పందిర్లు వేసి మరీ రాముల వారి కళ్యాణం జరిపిస్తారు.


Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..


శ్రీరాముడు, సీతమ్మ తల్లి కళ్యాణం జరిపించిన తర్వాత మాత్రమే ఇతరులు పెళ్లి చేసుకుంటారు. అందుకే ఇదే ఆచారంను ఇప్పటికి కూడా పాటిస్తు వస్తున్నారు. భద్రాచలంలో సీతమ్మకు మూడు తాళిబోట్లు ఉంటాయి. ఒకటి జనక మహారాజు, రెండవది దశరథుడు, మూడవది కంచర్ల గోపన్న చేయించాడంటా. అందుకే భద్రాచలం సీతమ్మకు మూడు తాళిబోట్లు ఉంటాయి.   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter