Srisailam: కార్తీక మాసంలో శ్రీశైలం మలన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతంటే?
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మల్లన్నకు భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది.
Karthika Masam hundi collection in srisailam: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు నెలరోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను (Lord Mallikarjuna) దాదాపు 10లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఈక్రమంలో శ్రీశైలం దేవస్థానానికి భారీగా రాబడి వచ్చింది. దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదాలు, టోల్‌గేట్, ప్రచురణల విక్రయాలు, తులాభారం, కేశఖండన, ఆన్‌లైన్ సేవలు, హుండీ ఆదాయం, తదితర సేవల ద్వారా సుమారు రూ. 30 కోట్ల పైగా ఆదాయం వచ్చింది.
శ్రీశైల మల్లన్నకు కార్తీక మాసం ఆదాయం మెుత్తం రూ.30,89,27,503ల వచ్చినట్లు దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. గత ఏడాది కంటే రూ.11.02కోట్ల ఆదాయం అధికంగా వచ్చినట్టిన్న మాట. ఇంత మెుత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరిపారు. కార్తీకమాసం చివరిరోజు మల్లన్న దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు సైతం పెద్ద ఎత్తున వచ్చారు.
శ్రీశైలం మల్లికార్జునుడికి వచ్చిన మొత్తం ఆదాయంలో సాధారణ జమల ద్వారా రూ.19,95,73,883, హుండీ కానుకల ద్వారా రూ.6,73,79,922, ఆన్‌లైన్ ద్వారా రూ.3,25,68,719, అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.94,04,979, ఉదయాప్తమాన సేవ ద్వారా రూ.8,08,928, ప్రదోషకాల సేవ ద్వారా రూ.22,35,324 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న వెల్లడించారు.
Also Read: Rahu Transit: 2023 అక్టోబరు వరకు మేషరాశిలో రాహువు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి