Srivari Darshanam Tickets: తిరుమల భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎంతవరకూ టికెట్లు జారీ చేస్తున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవారి భక్తుల కోసం టీటీడీ గుడ్‌న్యూస్ అందించింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఆఫ్‌లైన్ సేవల్ని నిలిపివేసిన టీటీడీ కేవలం ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయం ప్రారంభించింది. తిరుమల దర్శనం చేసుకోవాలని ఎదురుచూసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి టికెట్లు (Srivari Special Darshanam Tickets) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 


జనవరి 28 వ తేదీ అంటే ఇవాళ ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఆన్‌లైన్‌లో 3 వందల రూపాయల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తోంది. ఇవాళ ఈ ప్రత్యేక దర్శనం టికెట్లు, రేపు అంటే జనవరి 29వ తేదీ ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 12 వేల టికెట్లు జారీ చేయనున్నారు. అటు సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌‌లైన్‌లో విడుదల కానున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున..పరిమిత సంఖ్యలో టికెట్ల విడుదల ఉంటుందని టీటీడీ వెల్లడించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. టికెట్ కావల్సినవారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత టికెట్ల కోటాకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేసి..వివరాలు నమోదు చేయడం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. 


Also read: January 28 Horoscope: ఈ రాశి వారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook