Sun - Jupiter Conjunction on 22nd April 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్‌ నెలలో కొన్ని పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు రానుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మీనరాశిని వదిలి కుజుడు రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో ఏప్రిల్ 22న బృహస్పతి తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీని కారణంగా మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల మైత్రి జరగబోతుంది. 12 ఏళ్ల తర్వాత ఈ కూటమి ఏర్పడింది. సూర్యుడు మరియు గురుడు సంయోగం వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
కర్కాటక రాశి యొక్క పదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతుంది. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.  మీకు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. 


సింహరాశి 
ఈ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు..


మీనరాశి
మీన రాశి యొక్క రెండవ ఇంట్లో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోభివృద్ధి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


మేషరాశి
మేష రాశి యెుక్క మొదటి ఇంట్లో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతోంది. ఈ అరుదైన కలయిక కారణంగా మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసంతోపాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీ లాభాలు ఉంటాయి. 


Also Read: Surya Gochar 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?


మిధునరాశి
మిథునరాశికి 11వ ఇంటిలో సూర్యుడు మరియు గురు గ్రహ కలయిక ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook