Shani Surya yuti 2024: 30 ఏళ్ల తర్వాత శని-సూర్యుల కలయిక.. ఫిబ్రవరిలో ఈ 4 రాశులకు కష్టాలే ఇక..
Grah Gochar 2024: ఫిబ్రవరి నెలలో మూడు దశాబ్దాల తర్వాత శని, సూర్యుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా నాలుగు రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Surya yuti 2024: గ్రహాల కదలికలు ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. 30 ఏళ్ల తర్వాత తండ్రీ కొడుకులు కలయిక జరగబోతుంది. త్వరలో సూర్యుడు-శనిదేవుడు కలయిక జరగబోతుంది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడికి, శనికి అస్సలు పడదట. ఫిబ్రవరి నెలలో ఈ రెండు గ్రహాలు సంయోగం కొందరికి అస్సలు కలిసిరాదట. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహం
సింహరాశి యెుక్క ఏడో ఇంట్లో సూర్యుడు, శని కలయిక జరుగుతుంది. దీని కారణంగా మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. మీకు ఇతరులతో విభేదాలు వస్తాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగిరాదు. మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం
కుంభరాశి యెుక్క మొదటి గృహంలో సూర్యుడు, శని మీటింగ్ జరుగుతుంది. దీంతో మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. మీ జాబ్ సడన్ గా తీసేయచ్చు. మీరు ఈ సమయంలో సహనంతో ఉండాలి. మీరు అప్పులు ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో సూర్యుడు, శని సంయోగం సంభవించబోతుంది. దీని కారణంగా మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించండి. ఈ సమయంలో మీ లైఫ్ పార్టనర్ కు సపోర్టుగా నిలవాల్సి ఉంటుంది.
Also Read: Budh Gochar 2024: రేపటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతోంది.. ఇందులో మీ రాశి ఉందా?
మిథునరాశి
శని, సూర్యుని కలయిక మిథునరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ రాశి యెుక్క తొమ్మిదవ గృహంలో సూర్యుడు, శని కలయిక జరగబోతుంది. దీంతో మీకు కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. ఈ సమయం మీకు పరీక్షా కాలమనే చెప్పాలి. మీ తెలివితేటలు, నైపుణ్యాలను ఉపయోగించి దీనిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీకు సవాళ్లు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
Also Read: Shani Dev: శనివారం ఈ 5 వస్తువులను ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు.... జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook