Budh Gochar 2024: శనిదేవుడి రాశిలో `బుధాదిత్య రాజ్యయోగం`.. ఈ 4 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం..
Budhaditya rajyog: త్వరలో కుంభరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Surya Budh Yuti 2024 effect: గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. రీసెంట్ గా గ్రహాల రాజైన సూర్యుడు మకరరాశి నుండి బయటకు వచ్చి శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. మరో మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 20న గ్రహాల యువరాజైన బుధుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. దీంతో అదే రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం చాలా లాభాలను ఇస్తుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.
మకరరాశి
బుధుడు మరియు సూర్యుని కలయిక మకర రాశి వారికి మేలు చేస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది.
Also Read: Saturn Rising 2024: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..
మేష రాశి
సూర్యుడు మరియు బుధుల కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లాభపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే మీ కోరిక నెరవేరుతోంది. మీ పాత వ్యాధులన్నీ దూరమవుతాయి.
మిథున రాశి
బుధాదిత్య యోగం మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ లక్ కలిసి వస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Magh Purnima 2024: మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. మీ కోరికలు నెరవేరడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter