Magh Purnima 2024 Date and time: హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్యలకు చాలా విశిష్టత ఉంది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ఈ పౌర్ణమి నాడు స్నానం మరియు దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
మాఘ పూర్ణిమ ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, పూర్ణిమ తిథి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:33 నుండి ప్రారంభమై.. ఫిబ్రవరి 24 సాయంత్రం 5.59 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకోనున్నారు.
మాఘ పూర్ణిమ శుభ ముహూర్తం
మాఘ పూర్ణిమ యొక్క అభిజిత్ ముహూర్తం ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 12:12 నుండి మధ్యాహ్నం 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో స్నానం, దానం చేయడం, పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత
మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగలో స్నానం చేస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మీరు పాపాల నుండి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజున స్నానం చేసి దానం చేయాలి. ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also Read: Lucky Zodiac Signs: శని పాలించే కుంభ రాశిలోకి బుధ గ్రహం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ స్టార్ట్!
మాఘ పూర్ణిమ పూజా విధానం
మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. అనంతరం సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని సమర్పించండి. ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మీరు అనుకున్నది జరుగుతుంది. మాఘ పూర్ణిమ నాడు పేదలకు అన్నదానం చేయడం మంచిదిగా భావిస్తారు.
Also Read: Surya Mantra Telugu: ఈ సూర్య మంత్రాన్ని వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter