Sun and Mercury in Leo: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రెండు గ్రహాల కలయికకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆగస్టు 17వ తేదీన సూర్యుడు..సింహరాశిలో ప్రవేశించనుండగా..అప్పటికే ఆ రాశిలో బుధుడు ఆశీనుడై ఉన్నాడు. ఫలితంగా 3 రాశులవారికి ఆగస్టు 17 నుంచి మొత్తం జాతకమే మారిపోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల గోచారం లేదా రెండు గ్రహాల కలయిక ప్రభావం మొత్తం 12 రాశులపై, వారి జీవితంపై పడుతుంటుంది. ఇది శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. ఆగస్టు 17వ తేదీన సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలో మారనున్నాడు. ఫలితంగా సింహరాశిలో బుధాదిత్య రాజయోగం సంభవించనుంది. ఎందుకంటే సింహరాశిలో అప్పటికే బుధుడు ఆశీనుడై ఉన్నాడు.దాంతో బుధాదిత్య రాజయోగం ఉంటుంది. ఫలితంగా 3 రాశులవారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. రాజయోగం కారణంగా ఏయే రాశులకు అంతులేని ధన సంపదలు వస్తున్నాయో చూద్దాం..


వృశ్చికరాశి వారిపై ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 వరకూ అంటే ఐదు రోజుల వరకూ బుధాదిత్య యోగం ఉంటుంది. దాంతో వృశ్చికరాశివారి కెరీర్, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు, విజయం లభిస్తాయి. ఈ రాశి దశమ స్థానంలో బుధాదిత్య రాజయోగం సంభవించనుంది. దీనిని కర్మక్షేత్రం, ఉద్యోగ స్థానమంటారు. ఈ కాలంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముందునుంచే ఉద్యోగం చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. 


తులారాశివారిపై బుధాదిత్య రాజయోగం ఫలితం అద్భుతంగా ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ కాలంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది పూర్తిగా అందుకు అనుకూలమైన సమయం. ఆస్థులు, వాహనాలకు సంబంధించిన  నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన సమయం. విదేశాల్నించి ధనం సంపాదిస్తారు. 


సింహరాశివారికి రెండు గ్రహాల కలయిక ఫలితం అమోఘంగా ఉంటుంది. ఈ కాలంలో ఎనలేని డబ్బులు లభిస్తాయి. బుధాదిత్య రాజయోగం ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. డబ్బులొచ్చేందుకు కొత్త మార్గాలు కన్పిస్తాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు బాగుంటాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు కూడా అనువైన సమయం.


Also read: Sun Transit Effect: సింహ రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారికి జాక్ పాట్ ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook