Mercury Conjunction 2023: మిథునరాశిలో `బుధాదిత్య రాజయోగం`.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం!
Budh Gochar 2023: మరో రెండు రోజుల్లో గ్రహాలు యువరాజైన బుధుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది.
Sun and Mercury Conjunction will make Budhaditya RajYog in Gemini on 24th June 2023: నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈ నెల 15న మిథునరాశిలోకి ప్రవేశించాడు ఆదిత్యుడు. మరోవైపు జూన్ 24న బుధుడు కూడా మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ రాశిలో సూర్య-బుధ సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ముఖ్యంగా మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ 3 రాశులకు వరం
వృషభం: బుధాదిత్య రాజయోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది.
మిథునం: ఈ రాశిలోనే సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడింది. బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. పార్టనర్‌షిప్‌తో పనిచేసే వారికి లాభిస్తుంది.
Also Read: Guru Gochar 2023: భరణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..
తుల రాశి: బుధాదిత్య రాజయోగం కూడా తుల రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Ketu Gochar 2023: ఏడాదిన్నర తర్వాత ఈ రాశుల జీవితాల్లో వెలుగులు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook