Grah Gochar November 2022: ఈ మాసంలో గ్రహాల సంచారం వల్ల అనేక శుభ కలయికలు, యోగాలు ఏర్పడుతున్నాయి. బుధుడు మరియు సూర్యుడు ఒకే రాశిలో సంచరించనున్నారు. ఇది మొత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబర్ 13న బుధుడు, నవంబర్ 16న సూర్యభగవానుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వృశ్చికరాశిలో బుధాదిత్య యోగం (Budhaditya Yog in Scorpio 2022) ఏర్పడుతుంది. దీని వల్ల అనేక రాశులవారికి ధన నష్టం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): బుధుడు రాశి మారడం వల్ల ఈ రాశివారు సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సూర్యభగవానుడి సంచారం వల్ల మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 
వృషభం(Taurus): ఈ రాశి వారికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ రాశివారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సూర్యుడు నాల్గవ గృహానికి అధిపతి మరియు బుధుడు రెండవ మరియు ఐదవ గృహాలకు అధిపతి.
మిధునరాశి (Gemini): మిథునరాశి వారికి ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల అననుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ  కుటుంబంలో సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా వివాదంలో చిక్కుకునే అవకాశం  ఉంది.  


కర్కాటకం (Cancer): బుధుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఐదవ ఇంట్లో ఉంటాడు. అదే సమయంలో సూర్యభగవానుడు కూడా సంచార సమయంలో ఐదవ ఇంట్లో ఉంటాడు. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ఆలోచించి మాట్లాడండి. 
కన్య (Virgo): ఈ రాశి వారికి మొదటి మరియు లగ్న స్థానానికి అధిపతి బుధుడు. మరోవైపు, సూర్యభగవానుడు 12వ ఇంటికి అధిపతి. మీకు సోదరులు మరియు సోదరీమణులతో విభేదాలు రావచ్చు. మీరు విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. 


Also read: Rajyog: మీన రాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook