ఫిబ్రవరి నెలలో సూర్యుడి గోచారముంది. కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి పరివర్తనం ఫిబ్రవరి 13, 2023న జరగనుంది. మార్చ్ 14 వరకూ శని రాశి కుంభంలో ఉండనున్నాడు. ఫలితంగా ఆ మూడు రాశుల జీవితం అద్భుతంగా మారనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, శని గ్రహాలు శని రాశిగా ఉన్న కుంభరాశిలో కలవనుండటం కీలక మార్పులకు కారణం కానుంది. సూర్య, శని గ్రహాల యుతి ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతోంది. అదే సమయంలో 3 రాశులపై మాత్రం విశేషమైన లాభాలకు కారణం కానుంది. శని కుంభరాశిలో 30 ఏళ్ల తరువాత కొలువుదీరడం విశేషం.


శని, సూర్య గ్రహాల యుతితో మారనున్న అదృష్టం


మేషరాశి


మేషరాశి జాతకులకు కుంభరాశిలో ఏర్పడనున్న శని-సూర్య గ్రహాల యుతి అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఫిబ్రవరి 13న సూర్యుడి గోచారంతో మేషరాశి జాతకుల కోర్కెలు పూర్తవుతాయి. కెరీర్‌లో ఉన్నతి లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సవాళ్లు దూరమౌతాయి. మీ పనిపై ప్రశంసలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


వృషభరాశి


వృషభరాశి జాతకులకు కెరీర్‌పరంగా అత్యంత లాభదాయకం. ఈ జాతకులకు పనిలో అభివృద్ధి లభిస్తుంది. జీవితంలోని కీలక రంగాల్లో పటిష్టత ఉంటుంది. కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. పదోన్నతులు లభించే అవకాశాలుంటాయి. పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్దిక లాభముంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్‌లో డబ్బులు సంపాదించే అవకాశాలు తెర్చుకుంటాయి.


మకర రాశి


మకర రాశి జాతకులకు సూర్య శని గ్రహాల యుతి అత్యం శుభప్రదం కానుంది. సూర్యుడి రాశి పరివర్తనం ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది. పెద్దఎత్తున ధనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సంపద లభించే యోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో పెట్టుబడికి మంచి సమయం. ఉద్యోగ, వ్యాపారాలకు అనువైన సమయం.


Also read: Rahu Gochar 2023: మేషరాశిలో రాహు గోచారం.. ఈరాశులవారి ఇళ్లు డబ్బుతో నిండటం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook