Sun-Mars conjunction: సూర్య-కుజ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి వివాహ, వ్యాపార పెట్టుబడుల ప్రయత్నాలు ఫలిస్తాయి..
Sun-Mars conjunction In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో 12 గ్రహాలతో పాటు నక్షత్రాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దాదాపు అన్ని గ్రహా లు ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తాయి కొన్ని గ్రహాలు ప్రతి నెల సంచారం చేస్తే మరికొన్ని గ్రహాలు మాత్రం సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి రాశి సంచారం చేస్తాయి. ఇలా గ్రహాలు సంచారం చేయడం వల్ల జాతకాలపై ప్రభావం పడి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేసినప్పుడు అంతేకాకుండా ఆ గ్రహాలు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.
అయితే ఇలాంటి యాదృచ్చికమే ఏర్పడింది. ఫిబ్రవరి 5వ తేదీన మకర రాశిలోకి కుజుడు సంచారం చేశాడు ఇప్పటికే ఆ గ్రహంలో సూర్యుడు కూడా ఉన్నాడు. దీనికి కారణంగా సూర్య-కుజ గ్రహాల సంయోగం జరిగింది. మకర రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఆదిత్య మంగళ యోగం ఏర్పడింది. ఈ యోగం ఏర్పడడం కొన్ని రాశులకు శుభప్రదం అయితే మరికొన్ని రాశులకు దుష్ప్రభావాలు కలిగిస్తుంది.
మేషరాశి:
మేషరాశి వారికి మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడడం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాజయోగం వీరికి సమాజంలో గౌరవాన్ని పెంచబోతోంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి సూర్యుడు అనుగ్రహం లభించి పురోగతి కూడా లభిస్తుంది. ఈ సమయంలో వీరు ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే ఏదైనా మతపరమైన కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు మానసిక ప్రశాంతత కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరగడం కారణంగా విదేశీ ప్రయాణాలు చేయొచ్చు.
మిథున రాశి:
ఆదిత్య మంగళ యోగం ప్రభావం మిథున రాశి వారిపై కూడా పడబోతోంది. దీనికి కారణంగా వీరు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అంతే కాకుండా కుటుంబ జీవితంలో శుభవార్తలు వింటారు. ఈ మంగళ యోగం సమాజంలో గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఇక వివాహాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా బాధపడుతున్న వారికి సూర్య దేవుడి అనుగ్రహం లభించి కొత్త ఆదాయ వనరులు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఊహించని లాభాలు పొంది కొత్త ఆస్తులు భూములు కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు తగ్గి పొదుపు కూడా పెరుగుతుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
కన్యా రాశి:
మంగళ యోగం కారణంగా కుజుడి ప్రభావం కన్యా రాశి వారిపై కూడా ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి సంతోషం శ్రేయస్సు గౌరవం లభిస్తాయి. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు పొందుతారు. ఈ సమయంలో ధైర్యం పెరగడం కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. దీంతోపాటు శత్రువులను ఓడించడానికి కావాల్సిన అన్ని రకాల శక్తి సామర్థ్యాలు పొందుతారు. దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన ఎలాంటి పనులైనా ముందుగానే పూర్తి చేయగలుగుతారు. దీంతోపాటు ఈ సమయంలో వీరు మధురమైన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter