Surya Budh Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ గ్రహాల కలయికను సంయోగం అంటారు. ప్రస్తుతం సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఆదిత్యుడు మే 14 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఇప్పటికే బుధుడు మేషరాశిలో కదులుతున్నాడు. ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో 5 రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఆదిత్యుడు మరియు బుధుల కలయిక సింహ రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారికి బుధుడు మరియు సూర్యుని కలయిక శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారం చేసేవారు లాభం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
కుంభ రాశి 
సూర్యుడు మరియు బుధుల సంయోగం కుంభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 


Also Read: Surya Gochar 2023: సూర్యుడి గోచారంతో నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?


మేష రాశి
బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల మేషరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
కర్కాటక రాశి
సూర్యుడు మరియు బుధుడు సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారస్తులు ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. 


Also Read: Pluto Transit 2023: మకరరాశిలో ప్లూటో తిరోగమనం.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook