Pluto Grah Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కాలానుగుణంగా గ్రహాలు మరియు నక్షత్రాలు తమ రాశులను మారుస్తాయి. నవగ్రహాల్లో ప్లూటో కూడా ఒకటి. మే 01, రాత్రి 10.36 గంటలకు ప్లూటో మకరరాశిలో తిరోగమనం చేశాడు. అదే స్థితిలో అక్టోబర్ 11 ఉదయం 7.06 గంటలకు ఉంటాడు. ప్లూటోను యమ గ్రహం అని కూడా పిలుస్తారు. మకరరాశిలో ప్లూటో వక్రీ కారణంగా ఏ రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
వృషభం
మీ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో ప్లూటో తిరోగమనం చేయనున్నాడు. దీని కారణంగా మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
కర్కాటక రాశి
ప్లూటో ఈ రాశిచక్రంలోని ఏడవ ఇంటిలో సంచరించనున్నాడు. అక్టోబర్ 11 వరకు ప్లూటో మీకు మంచి బెనిఫిట్స్ అందించబోతున్నాడు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు పని పనిలో మీ లైఫ్ పార్టనర్ సపోర్టు ఉంటుంది.
కన్య రాశి
మీ రాశి యెుక్క ఐదో ఇంట్లో ప్లూటో సంచరించనున్నాడు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబరు 11 వరకు మీరు శుభఫలితాలను పొందుతారు. ఇంట్లో వెండితో చేసిన ఏనుగును ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read: Mars transit 2023: మే 10న అంగారకుడి రాశి మార్పు.. ఈ రాశులకు లాభాలు బోలెడు..
తులారాశి
ఈ రాశి యెుక్క నాల్గవ ఇంట్లో ప్లూటో సంచరిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 11 వరకు వెండి వస్తువును ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి
ప్లూటో ఈ రాశిచక్రంలోని రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
మీనరాశి
మీ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో ప్లూటో తిరోగనం చేయనున్నాడు. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. వీలైతే అక్టోబర్ 11 వరకు వెండి గ్లాసులో నీళ్లు తాగడం మీకు మంచిది.
Also Read: Mangal Shukra yuti 2023: మరికొన్ని గంటల్లో ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pluto Transit 2023: మకరరాశిలో ప్లూటో తిరోగమనం.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం..