Surya Budh yuti in dhanu Rashi 2023: గ్రహాల రాజైన సూర్యుడు నెలకొకసారి రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి యెుక్క రాశి మార్పునే సంక్రాంతి అంటారు. డిసెంబరు 16న సూర్యుడు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. అయితే ఇప్పటికే అదే రాశిలో గ్రహాల రాకుమారుడైన బుధుడు సంచరిస్తున్నాడు. ధనస్సు రాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇదే సమయంలో మేషరాశిలో రాజలక్షణ రాజయోగంతో పాటు రుచక రాజయోగం కూడా రూపొందుతోంది. బుధాదిత్య యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
బుధాదిత్య రాజయోగం వల్ల సింహరాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు మీకు ప్యూచర్ లో మీకు మంచి లాభాలను ఇస్తాయి. చాలా కాలంగా ఉద్యోగం ఎదురుచూసే వారి కల నెరవేరుతోంది. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరిగే అవకాశం ఉంది, ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు.
మేషరాశి
ధనస్సు రాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు పోటీపరీక్షల్లో విజయం సాధించి జాబ్ పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. అంతేకాకుండా మీరు 2024లో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 
తులారాశి 
సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల మీరు ఏ  రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు భారీ మెుత్తంలో డబ్బు సంపాదిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు పెద్ద ప్యాకేజీతో వేరే జాబ్ పొందుతారు. 


Also Read: Budh gochar: వచ్చే ఏడాది ప్రారంభంలో బుధుడి రాశిలో మార్పు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook