Sun, Mercury Transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాల మార్పుల కారణంగా మొత్తం 12 రాశులవారిపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవంబర్‌ రెండవ వారంలో రెండు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. నవంబర్ 16న కుజుడు, నవంబర్ 17న సూర్యుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. అయితే ఈ సూర్యుడు, కుజుడు గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
ఈ రెండు రాశుల సంచారం కారణంగా మేష రాశివారికి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అధికారుల మద్దతు లభిస్తుంది. దీని కారణంగా ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ సమయంలో చాలా ఓపితో ఉండడం చాలా మంచిది. వీరు మతపరమైన సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఆదాయం కూడా రెట్టింపు అవ్వడమే కాకుండా మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


వృషభ రాశి: 
వృషభ రాశివారు సంభాషించే సమయంలో చాలా ఓపికగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసులు మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు అదనపు ఖర్చులు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరు ఈ సమయంలో ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. 


మిథున రాశి: 
సూర్యుడు, కుజుడు రెండు గ్రహాల సంచారం కారణంగా మిథున రాశివారికి కోపం లేదా ఆవేశం పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు పిల్లల నుంచి శుభవార్తాలు వింటారు. మిథున రాశి వారు ఈ సమయంలో విద్యా, పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో తండ్రి ఆరోగ్యంగా క్షిణించే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతారు.  


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల ఆశ, నిస్పృహ అనే భావాలు మనసులో మెదులుతాయి. దీంతో పాటు వ్యాపార పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో ఓపిక నశించడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావొచ్చు. దీంతో పాటు కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు భవనం లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఛాన్స్‌లు ఉన్నాయి. 


Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!


సింహ రాశి:
కుజుడు, సూర్యుడు సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి సహనం తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో విద్యార్థులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ రాశివారు పాత స్నేహితులకు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు మొత్తం తగ్గిపోయి..సంపాదన పెరుగుతుంది. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


మకర రాశి:
ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్నేహితుల నుంచి వ్యాపార ప్రతిపాదనలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు సమానంగా ఖర్చులు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అన్ని పనుల్లో జీవిత భాగస్వామి నుంచి మద్ధతు లభిస్తుంది. 


Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook