Shadashtak Yog: మరో 4 రోజుల్లో సూర్యుని రాశి మార్పు, అశుభకరమైన `షడష్టక యోగం`.. ఈ రాశులవారికి అదృష్టం!
Shadashtak Yog: కన్యారాశిలో సూర్యుడు, బుధుడు సంచరించడం వల్ల మేషరాశిలో రాహువుతో షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అశుభకరమైన యోగం. కానీ ఇది కొన్ని రాశులకు కలిసి వస్తుంది.
Surya Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యభగవానుడు..కీర్తి, బలం, గౌరవానికి చిహ్నం. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఈ నెల 17, శనివారం ఉదయం 7:11 గంటలకు సూర్యుడు తన సొంతరాశిని విడిచిపెట్టి బుధుడి రాశి అయినా కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశిస్తాడు. నెలరోజులపాటు అదే రాశిలో ఉంటాడు.
ఈ మూడు రాశులపై శుభప్రభావం
వృశ్చికం (Scorpio): కన్యారాశిలో సూర్య సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్లు స్వీకరిస్తారు. ఈ సమయం ఆస్తి మరియు వాహనాల కొనుగోలుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహం (Leo): మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. ఎక్కడైనా మీ డబ్బు చిక్కుకుపోయి ఉంటే తిరిగి దానిని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీరు జాబ్ ఆఫర్ పొందవచ్చు. మెుత్తాన్ని ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
అశుభ షడష్టక యోగం
కన్యారాశిలో సూర్యుడు బుధుడు సంచరించడం వల్ల మేషరాశిలో రాహువుతో షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అశుభకరమైన యోగం. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ యోగం మీ ఇంటి పెద్ద మరణానికి కారణం కావచ్చు. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు మెుదలైన సమస్యలు తలెత్తవచ్చు. ఈ అశుభకరమైన యోగం కొందరికి శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries) : పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం (Cancer): ఆరోగ్యంలో మెరుగుదల, వృత్తిలో విజయం, ఆఫీసులో సీనియర్ అధికారులు మరియు సహోద్యోగుల మద్దతు ఉంటుంది.
వృశ్చికరాశి (Scorpio): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తే అది మీకు కలిసి వస్తుంది.
Also Read: సూర్య, రాహు షడష్టక యోగం... సెప్టెంబర్ 17 నుంచి ఈ 5 రాశులవారు బీ అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook