Sun transit 2023: జనవరి 14 వరకు ధనుస్సు రాశిలోనే సూర్యభగవానుడు.. ఇక వీరికి పండగే పండుగ..
Sun transit 2023: జనవరి 14 వరకు సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి సూర్యుడు భారీ మెుత్తంలో ధనాన్ని ఇవ్వనున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. సమాజంలో గౌరవాన్ని ఇచ్చే సూర్యభగవానుడు డిసెంబరు 16 నుండి ధనుస్సు రాశిలోనే ఉన్నాడు. సూర్య సంచారం (Sun transit in Sagittarius 2023) జనవరి 14తో ముగుస్తుంది. అనంతరం సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ధనుస్సు రాశిలో సూర్య గోచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి (Aries): సూర్య సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారాల్లో భారీగా లాభాలను గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మిథునం (Gemini): ధనుస్సు రాశిలో సూర్యభగవానుడి సంచారం వల్ల మిధునరాశి వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు రెట్టింపు లాభాలను గడిస్తారు.
ధనుస్సు (Sagittarius): ఈ రాశిలోనే సూర్యభగవానుడు సంచరిస్తాడు కాబట్టి వీరి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు. ఈ సమయంలో వీరు తెలివిగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభిస్తాయి.
మీనం (Pisces): సూర్యుడి గమనంలో మార్పు మీనరాశివారి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంది.
Also Read: Shani Rahu effect: మీరు చేసే ఈ పనులు శని-రాహువులకు కోపం తెప్పించవచ్చు, నివారణ కోసం ఇలా చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.