Sun Saturn Rahu Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల పరివర్తనం, గోచారానికి విశేష మహత్యముంది. సెప్టెంబర్ నెలలో సూర్యుడి కన్యారాశి ప్రవేశం సందర్భంగా శని గ్రహం, రాహువుతో కలిసి ప్రమాదకరంగా మారనుంది. ఫలితంగా కొన్ని జాతకాలవారికి తీవ్రమైన ధన హాని కలగడమే కాకుండా వ్యాదుల ముప్పు పొంచి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడి గోచారముంది. అప్పటి వరకూ సింహ రాశిలో ఉండే సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు అదే సమయంలో శని గ్రహం కుంభ రాశిలో, రాహువు మేష రాశిలో ఉంటారు. సెప్టెంబర్ నెలలో సూర్యుడు, శని కలిసి ప్రమాదకరంగా మారనున్నాయి. దాంతోపాటు మేష రాశిలో ఉన్న రాహువు గురు చండాల యోగం ఏర్పర్చనున్నాడు. సెప్టెంబర్ నెలలో సంసప్తక్ యోగం కూడా ఉంది. ఈ అన్ని కారణాల ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. కానీ 3 రాశుల జాతకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


జ్యోతిష్యం ప్రకారం శని, సూర్య, రాహు గ్రహాల ప్రమాదకర పరిస్థితి వృశ్చిక రాశి జాతకులకు హాని చేకూర్చనుంది. ఉద్యోగంలో వ్యాపారంలో ఎగుడు దిగుడు ఉండవచ్చు. సాధ్యమైనంతవరకూ సంయమనంతో ఉంటూ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు. డబ్బులు చిక్కుకుపోతాయి. కొత్త పనులు ప్రారంభించే అవకాశముంది. సెప్టెంబర్ నెల అందుకే జాగ్రత్తగా ఉండాలి.


శని, రాహు, సూర్య గ్రహాల అశుభ ప్రభావం కర్కాటక రాశి జాతకులపై పడుతుంది. ఇది ప్రమాదకరం కావచ్చు. ప్రస్తుతం శని దుష్ప్రబావం కన్పిస్తుంది. ఎందుకుంటే గురు చండాల యోగం కూడా జ్యోతిష్యపరంగా అంతమంచిది కాదు. డబ్బులు చేతికి వచ్చినా విపరీతంగా ఖర్చయిపోతుంటాయి. ఆసుపత్రి ఖర్చులు అధికమౌతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిదని అంటున్నారు జ్యోతిష్య పండితులు


కన్యా రాశి జాతకులకు ఈ సమయం అంత మంచిది కాదు. వ్యాపారం పెంచుకునేందుకు ఏమాత్రం అనువైన సమయం కాదు. బయటి తిండి తినవద్దు. ఆరోగ్యం వికటించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్  నెలంతా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సూర్యుడు, శని, రాహు గ్రహాల అశుభ ప్రభావం ప్రతీకూలంగా ఉంటుంది.


Also read: Supermoon 2023: ఇవాళ రాత్రి సూపర్ మూన్, రక్షాబంధన్ ముహూర్తం సమయం, తేదీ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook