COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mars And Sun Planets Combination: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు రివర్స్ దశలో కూడా కదులుతూ ఉంటాయి. దీనినే శాస్త్ర పరిభాషలో తిరోగమనంగా పిలుస్తారు గ్రహాలు తిరోగమనం చేసినప్పుడు సంచారం చేసినంత ప్రభావమే అన్ని రాశుల వారిపై పడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో తిరోగమనానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్వరలోనే గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా రివర్స్ కదలికలు చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ గ్రహం మీన రాశిలో సంచార క్రమంలో ఉంది. ఏప్రిల్ 13వ తేదీన ఈ సూర్యగ్రహణం మీనరాశి నుంచి తిరోగమన దశలో మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే మేషరాశిలో కుజ గ్రహం సంచార క్రమంలో ఉంది. కుజ, సూర్య గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి అంతులేని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశులు లాభాలు పొందబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  


సింహం:                         
ఏప్రిల్ 13వ తేదీన జరిగే సూర్య కుజ గ్రహాల కలయిక కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అన్ని రకాల పనులు సులభంగా పూర్తవుతాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల కష్టతరమైన పనులను కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే అదృష్టం కూడా మీ వైపు ఉండడం వల్ల పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. దీని కారణంగా అన్ని పనులు పాజిటివ్ నెస్‌తో చేయగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాయడం కష్టపడి చదవడం కారణంగా టాపర్లుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
         
మేషం:

మేష రాశి వారికి కూడా ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో కష్టపడి పని చేయడం కారణంగా తగిన ప్రతిపాదన కూడా పొందుతారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగార భరితంగా ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామి మధ్య ఉన్న గొడవలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సూర్యుడు అనుగ్రహం లభించి, విపరీతమైన డబ్బును పొందుతారు కెరీర్‌కు సంబంధించిన విషయంలో కూడా పురోగతి లభిస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మిథున:
కుజ సూర్య గ్రహాల కలయిక మిధున రాశి వారికి కూడా ఎంతో లాభదాయకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పరిష్కారం లభించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అనేక రకాల ఆదాయ వనరులు పొందుతారు దీని కారణంగా ఆర్థిక లాభాలను కూడా పొందే అవకాశాలున్నాయి. అలాగే కిరీకు సంబంధించిన విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు మరింత మెరుగుపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఎప్పటినుంచో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందాలనుకునే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి