Sun Transit 2022: సూర్యగ్రహం కుండలిలో బలంగా ఉంటే..ఆ వ్యక్తికి ఉద్యోగం, గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠ లభిస్తాయి. జూన్ 15న సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ఈ నాలుగు రాశులపై ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశుల పరివర్తనం ప్రభావం మిగిలిన అన్ని రాశులపై పడుతుంది. నాలుగు రోజుల తరువాత అంటే జూన్ 15వ తేదీన సూర్యుడు..మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. అంటే సూర్యుడు రాశి మారగానే..అన్ని రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. మిధున రాశిలో సూర్యుడు జూలై 16 వరకూ ఉండనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని ప్రఖ్యాతం, పేరు ప్రతిష్టలు, ప్రభుత్వ ఉద్యోగం, విజయం, గౌరవ మర్యాదలకు ప్రతీకగా చెబుతారు. ఎవరి జాతకం కుండలిలో సూర్యుడు బలమైన స్థితిలో ఉంటాడో..వారికి మంచి ఉద్యోగం, పదోన్నతి వంటివి లభిస్తాయి. సూర్యుడి గోచారం వల్ల ఈ రాశులపై అద్భుత ప్రభావం ఉంటుంది.


వృషభరాశి వారికి వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల కన్పిస్తుంది. ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే..ఇదే అత్యంత అనువైన సమయం. పెట్టుబడులతో మంచి లాభాలుంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.


కన్యరాశివారి జాతకంలో అదృష్టం రాసుంది. గోచారం సందర్భంగా ఒక నెలంతా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో విజయం లభిస్తుంది. వేతనంలో పెంపు ఉంటుంది. ఈ సందర్భంగా పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. పనిచేసే చోట మీ కీర్తి పెరుగుతుంది. 


సింహరాశివారి జాతకంలో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. కొత్త మార్గాలు తెర్చుకుంటా.ి. వేర్వేరు దిశల్నించి లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాణ్వేషణ ఫలిస్తుంది. వ్యాపారంలో కూడా లాభాలు ఆర్జిస్తారు. 


తులరాశి జాతకంలో కూడా అదృష్టం కలిసొస్తుంది. ఈ సందర్భంగా ఆదాయం పెరుగుతుంది. ఉన్నత అధికారుల సహకారం లభిస్తుంది. భారీగా డబ్బులు వస్తాయి. ఓ నెల రోజులపాటు ఇలాగే అంతా శుభంగా ఉంటుంది. 


Also read: Zodiac Sign For love: ఈ 3 రాశులవారు నిజమైన ప్రేమను పొందాలంటే ఎన్నో పోరాటాలు చేయాలి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook