Sun Transit 2022: సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతుంటాడు. ఆగస్చు 17న సూర్యుడు సింహరాశిలో ప్రవేశించాడు. సెప్టెంబర్ 17 వరకూ అదే రాశిలో ఉండనున్నాడు. సూర్యుడి రాశి పరివర్తనం కొన్ని రాశులకు అమితమైన లాభాలు కలుగుతాయి. మిగిలిన రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి రాశి మారుతూనే కొన్ని రాశులకు శుభంగా, మరికొన్ని రాశులకు అశుభంగా మారనుంది. కొన్ని రాశులవాళ్లు సెప్టెంబర్ 17 వరకూ చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.


సింహరాశి జాతకులకు సూర్యుడు 12వ దశలో గోచారం చేయనున్నాడు. ఈ పరిస్థితుల్లో రాశి పరివర్తనం ఈ రాశివారిపై ప్రతికూలంగా ఉండనుంది. ప్రత్యేకించి వ్యాపారవర్గాలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది.


ధనస్సురాశి వారికి సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం పెద్దఎత్తున ధననష్టాన్ని కల్గించనుంది. ప్రత్యేకించి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి ప్లాన్ చేస్తుంటే..సెప్టెంబర్ 17 వరకూ వాయిదా వేయడం మంచిది. పెట్టుబడి తప్పదనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగస్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి.


మకర రాశివారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. లేకపోతే కుటుంబ వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో నష్టాలొచ్చే అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుకోవాలి.


మీనరాశివారికి సంతాన సంబంధిత విషయాల్లో ప్రతికూల ప్రభావం పడనుంది. ఉద్యోగం చేసేవారు పనిచేసే చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితులు పాడవుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆలోచించుకోవాలి.


Also read: Mercury Transit 2022: కన్యా రాశిలోకి బుధ గ్రహం.. ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్ అయినట్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook