Sun Transit 2022: కర్కాటక రాశిలోకి సూర్యుడు.. నెల రోజుల పాటు ఈ రాశి వారిపై తీవ్ర ప్రభావం!
Surya Gochar effect on libra zodiac sign peoples. జులై 16న రాత్రి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. తుల రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
Sun Transit 2022, Sun transit in libra on july 16: వాస్తుశాస్త్రం ప్రకారం... సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక నెల పాటు ఉంటాడు. ఈ క్రమంలోనే జులై 16న రాత్రి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి.. ఆ రాశిని చంద్రుని ఇల్లుగ భావిస్తారు. చంద్రుడు ఇంట్లోకి ప్రవేశించిన సూర్యుడు నెల పాటు ఉండడం వల్ల వివిధ రాశి చక్రాలపై ప్రభావం పడనుంది. కొన్ని రాశుల వారికి మంచి జరిగితే.. మరికొన్ని రాశుల వారికి చెడు జరగనుంది. ఈ రోజు తుల రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశిలోకి సూర్యుడు రాకతో తుల రాశి వారికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. తుల రాశి వారికి ఉదోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ల జాబితాలో వీరి పేరు అగ్ర స్థానంలో ఉంటుంది. ఈ ప్రమోషన్ వారి కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రమోషన్ నుంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఎందుకంటే పే స్కేల్ కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల తుల రాశి వారు ఏ పని చేసినా విజయం అందుకుంటారు. ఈ నెల రోజుల కాలంలో విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లేదా పోటీ పరీక్షలకు ప్రయత్నించిన యువకులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయం లాభాలను తెచ్చిపెడుతుంది. పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి రావచ్చు.
తుల రాశి వారికి ఈ నెల రోజలు చాలా ఆనందంగా గడుస్తాయి. కుటుంబం, బంధువులతో కలిసి విహార యాత్రకు వెళతారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుస్తారు. తుల రాశి వారు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను లేదా సమాజంలోని ప్రముఖ రాజకీయ, సామాజిక వ్యక్తులను కలుస్తారు. ఈ పరిచయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడనుంది. మీరు పండితులు, సాధువుల ఆశీర్వాదాలు పొందుతారు.
Also Read: Supermoon 2022: రేపే అంతరిక్షంలో మరో అద్భుతం.. సముద్రాలపై తీవ్ర ప్రభావం!
Also Read: Shani Transit: నేడు మకర రాశిలోకి శని ప్రవేశం... ఈ 3 రాశుల వారికి ఇక అంతా శుభమే...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook