Sun Tranist 2022: గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్య గ్రహం ఈ నెల 16న కర్కాటక  రాశిలోకి ప్రవేశించనుంది. ఆరోజు రాత్రి 10.50 గంటలకు సూర్యుడి రాశి మార్పు జరుగుతుంది. ఆగస్టు 17, ఉదయం 7.14 గం. వరకు సూర్యుడు అదే రాశిలో సంచరిస్తాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఆవిధంగా సూర్యుడు చంద్రుని ఇంట్లో సంచరించనున్నాడు. ఇది రాశిచక్రంలోని పలు రాశుల వారిపై సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. కన్య రాశిపై దాని ప్రభావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగ రీత్యా ఎలా ఉంటుంది :


కన్యా రాశి ఉద్యోగులకు ఈ కాలంలో ప్రమోషన్ లభించవచ్చు. ఆఫీసులో మీ బాస్ మీ పట్ల ప్రత్యేకాభిప్రాయంతో ఉంటారు. అది మీకు సానుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతోనూ స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానం జరిగే అవకాశం ఉంటుంది.


కళా రంగంలో ఉన్నవారికి :


కళా రంగంలో కన్య రాశి వారికి ఈ కాలం కలిసొస్తుంది. ముఖ్యంగా రచనా, సామాజిక సేవ, కళా సంస్కృతిలో ఉన్నవారు ప్రభుత్వం నుంచి అవార్డు పొందుతారు. లేదా ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది.


ఆర్థికంగా ఎలా ఉంటుంది :


ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉంటుంది. డబ్బుకు కొదువ ఉండదు. పెద్దల ఆశీర్వాదంతో కలిసొస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ అవకాశం ఉండటంతో వేతనం పెరుగుతుంది. ఇతరులు ఆశించే స్థితిలో ఉంటారు.


ఆరోగ్య పరిస్థితి :


ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. పాత వ్యాధులు నయమవుతాయి. మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీలో సద్గుణాలు పెరుగుతాయి. అది మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు. కష్టాల్లో ఉన్నవారికి తోచిన సాయం చేస్తారు. తద్వారా పుణ్యం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Supermoon 2022: రేపే అంతరిక్షంలో మరో అద్భుతం.. సముద్రాలపై తీవ్ర ప్రభావం!


Also Read:Guru Purnima 2022: రేపు గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook