Sun Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు పిలుస్తుంటారు. విజయం, గౌరవం, ఆరోగ్యం, శ్రేయస్సుకు కూడా గ్రహంగా కూడా సూర్యుడిని ప్రతీకగా చూపిస్తుంటారు. ఎంతో విశిష్ఠత కలిగిన సూర్యుడు 2022 ఏప్రిల్ 14న రాశి చక్రం మారనున్నాడు. మేష రాశిలోకి మారి.. దాదాపు నెల రోజుల పాటు ఉండనున్నాడు. ఈ పరిణామం నాలుగు రాశుల వారికి అత్యంత.. అత్యంత శ్రేయష్కరంగా మారనుందట. ఇంతకీ ఆ రాశులు ఏవి? వారికి కలిగే ప్రయోజనాలు ఎలా ఉండనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది..


ఈ రాశివారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందట. ఉద్యోగం, వ్యాపార విషయాల్లో సానుకూల మార్పులకు అవకాశముంది. వ్యక్తిగత పురోగతితో పాటు.. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుందట. ఇంట్లో కూడా సుఖసంతోషాలు నిండుకుంటాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.


వృషభ రాశి వారి చిన్న జాగ్రత్త పాటిస్తే చాలు..


రాశిచక్రంలో సూర్యుడు స్థితి మారడం వల్ల వృషభ రాశి వారికి కొత్త ఉగ్యోగ అవకాశాలు పెరుగాతాయట. అంతే కాదు.. కోరుకున్న పదవి లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీనితో పాటు ఆర్థికంగా పుంజుకుంటారని చెబుతున్నారు. అయితే ఈ రాశివారి తమ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. చిన్న కోపం కూడా పెద్ద సమస్యకు దారితీయొచ్చని అంటున్నారు.


కర్కాటక రాశి వారికి వృత్తి జీవితం బాగుంటుంది..


సూర్యుడి ప్రభావం వల్ల.. కర్కాటక రాశి వారికి ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అనుకోని పెద్ద మొత్తంలో డబ్బు చేతికొస్తుందట. ఇక వృత్తి జీవితం సానుకూలంగా సాగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పదోన్నతి లభించవచ్చని.. అంతే కాకుండా స్థాన చలనం కూడా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.


సింహరాశి వారికి సొంతింటి కల నెరవేరొచ్చు..


సింహరాశి వారిపై.. సూర్యుడి ప్రభావం వల్ల అన్ని విషయాల్లో పురొగతి లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఉద్యోగంలో సీనియర్ల సహకారంతో ఉన్నత శిఖరాలకు చేరుతారని అంటున్నారు. అంతే కాకుండా.. ఇళ్లు, కారు వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయట.


నోట్​: ఈ వార్తలోని సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. వాటిని ZEE తెలుగు News ధ్రువీకరించలేదు.


Also read: Sriramanavami: భద్రాచలంలో సీతారాముల కళ్యాణ విశేషాలు తెలుసుకుందామా


Also read: Coconuts Astrological Benefits: కొబ్బరికాయతో ఇలా చేస్తే తప్పక దైవ అనుగ్రహం సిద్ధిస్తుంది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook