Coconuts Astrological Benefits: హిందూ సాంప్రదాయంలో నిర్వహించే ఏ పూజా క్రతువులోనైనా కొబ్బరి కాయ తప్పనిసరి. భక్తి భావంతో కొబ్బరి కాయ కొట్టి దాన్ని భగవంతుడికి సమర్పించుకుంటారు. కొబ్బరికాయను మనిషితో, దాని పీచును మనిషి జుట్టుతో, అందులోని లేత కొబ్బరిని మనసుతో పోలుస్తారు. కొబ్బరికాయను దేవుడి నివేదన చేయడం ద్వారా మనసులోని కల్మషం, అహంకారం, ద్వేషం తొలగిపోతాయని నమ్ముతారు. హిందూ సాంప్రదాయాల్లోనే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోనూ కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్య శాస్త్రం 'కొబ్బరికాయ' గురించి ఏం చెబుతోంది :
1) ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే... వారు భగవాన్ హనుమంతుడికి కొబ్బరికాయ సమర్పించడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను చుట్టి... మొదట దాన్ని పేషెంట్ బాడీ చుట్టూ గడియారం ముల్లు దిశలో ఏడుసార్లు తిప్పాలి. అనంతరం దాన్ని భగవంతుడికి సమర్పించాలి.
2) కొంతమంది ఎంత కష్టపడినా... ఎంత ఫోకస్ పెట్టినా సరే తాము ఉన్న రంగాల్లో రాణించలేరు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు వారికి కలిసిరావు. అలాంటి వారు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొబ్బరికాయను సమర్పించాలి. ఇందుకోసం ఒక పచ్చని వస్త్రంలో కొబ్బరికాయను చుట్టి లక్ష్మీ దేవి పాదాల చెంత ఉంచాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవితో పాటు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం సిద్దించి కార్య సిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు.
3) ఒకవేళ మీ ఇంటిపై ఏదైనా దుష్ట శక్తి కన్ను పడితే... దాన్ని ప్రారదోలేందుకు కొబ్బరికాయతో ఒక రెమెడీ ఉంది. కొబ్బరికాయను చేతిలో పట్టుకుని... దాన్ని ఆ ఇంటి యజమాని తల చుట్టూ తిప్పాలి. ఆ తర్వాత ఇంటికి దూరంగా ఆ కొబ్బరికాయకు నిప్పంటించి దగ్ధం చేయాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులు పారిపోతాయని పండితులు చెబుతారు.
Also Read: Rahul Tewatia: ఎంఎస్ ధోనీ తర్వాత.. ఆ రికార్డు రాహుల్ తెవాటియాదే!
Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook