Sun Transit 2023: సూర్యుడి సంచారంతో ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం ప్రారంభం, మీ రాశి ఉందా?
Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశివారికి కోరుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అయితే ఈ రాశివారికే కాకుండా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit 2023: సూర్య గ్రహం ప్రతి నెలలో ఏదో ఒక రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ నెలలో మేష రాశి నుంచి వృషభర రాశిలోకి సంచారం చేసింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంచారం అన్ని రాశులవారికి చాలా ప్రాముఖ్యమైనది. సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేసిన వెంటనే పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై సూర్యగ్రహ సంచారం:
వృషభ రాశి:
ఈ రాశివారు సూర్యగ్రహం సంచారంతో కార్యాలయంలో కష్టపడి పనులు చేయం వల్ల విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో చాలా లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం గడిపేవారికి ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో మంచి గుర్తింపుతో పాటు గౌరవం కూడా పొందుతారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా సూర్యగ్రహ సంచారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు ఆర్థికంగా వెనకబడి ఉంటే మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారలు చేసేవారు పెట్టబడులు పెట్టడం వల్ల మంచి భారీ లాభాలు కలుగుతాయి.
సింహ రాశి:
సింహ రాశివారికి కూడా ఈ క్రమంలో చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగం, వ్యాపారాల చేసేవారికి ఈ క్రమంలో మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి గౌరవం, హోదా కూడా పెరుగుతుంది. స్త్రీలు ఈ క్రమంలో జీవిత భాగస్వామితో సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
ధనుస్సు రాశి:
సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంచారం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి