Surya Gochar 2023: నిన్న ఉదయం వరకు మకరరాశిలో సంచరించిన సూర్యభగవానుడు అనంతరం కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీనినే కుంభ సంక్రాంతి అంటారు. ఇప్పటికే శనిదేవుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. కుంభంలో ఈ రెండు రాశుల కలయిక కూడా ఏర్పడింది. సూర్యగోచారం వల్ల కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం ప్రారంభంకానుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గోచారం ఈ రాశులకు కష్టకాలం


కన్యారాశి 
సూర్యగోచారం వల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలోని ఆరవ ఇంట్లో కూర్చున్న సూర్యుడు-శని కలయిక సమస్యలను పెంచుతుంది. మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా అది చెడిపోయే అవకాశం ఉంది. శత్రువులు మిమ్మిల్ని ఇబ్బంది పెడతారు. మీ రిలేషన్ షిప్ లో హెచ్చు తగ్గులు ఉంటాయి. 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శని, సూర్యుల కలయిక మంచిది కాదు. మీ జాతకంలో నాల్గవ ఇంట్లో శని-సూర్యుడు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే మీరు నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు ఈ సమయంలో చిన్నపాటి ప్రమాదం జరగవచ్చు.
కర్కాటక రాశి
మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు-శని కలయిక కారణంగా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే ఫిబ్రవరి 13 నుండి మార్చి 15 వరకు మీరు ఈ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఇతరులతో వాదోపవాదాలు పెరుగుతాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోండి. 
సింహరాశి 
మీ జాతకంలో సూర్యుడు-శని కలయిక ఏడవ ఇంట్లో ఉండటం వల్ల మీ లైఫ్ పార్టనర్ తో గొడవలు రావచ్చు. మీ వైవాహిక జీవితంలో గందరగోళం నెలకొంటుంది. న్యాయపరమైన విషయాల్లో మీకు ఎదురుదెబ్బలు తగలవచ్చు. మీ వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మిమ్మిల్ని మోసగించే అవకాశం ఉంది. 


Also Read: Jupiter Rise Effect: గురు గ్రహంతో హంస రాజయోగం, ఆ 3 రాశులకు ఏప్రిల్ 22 తరువాత ఊహించని ధన సంపద



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook