గురుడు ఏడాదిలో ఒకసారే గోచారం లేదా రాశి పరివర్తనం చెందుతుంటాడు. గురు గ్రహాన్ని అదృష్టం, పెళ్లి, సుఖ సంతోషాలకు కారకుడిగా పిలుస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన గురుడు మీనరాశి నుంచి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావమే ఇప్పుడు ఆ రాశులకు అత్యంత ప్రాధాన్యత కల్గిస్తోంది.
గురు గ్రహం ఏప్రిల్ 22వ తేదీ మీనరాశి నుంచి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం గురుగ్రహం అస్థిత్వం కోల్పోనున్నాడు. గురుడు మీనరాశిలో ఆస్థిత్వం కోల్పోయి..ఏప్రిల్ 29 వ తేదీన మేషరాశిలో ఉదయిస్తాడు. గురు గ్రహం ఉదయం హంస రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. గురు ఉదయంతో ఏర్పడే హంస రాజయోగం కారణంగా కొన్ని రాశుల జాతకులకు అంతులేని లాభాలు కలగనున్నాయి. ఈ రాశులకు దశ తిరిగిపోతుందని చెప్పవచ్చు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం..
గురు ఉదయంతో ఏయే రాశులకు అంతులేని సుఖ సంతోషాలు
కర్కాటక రాశి
గురు ఉదయం కర్కాటక రాశివారికి అత్యంత శుభ సూచకం కానుంది. ఈ జాతకం వారు కెరీర్, వ్యాపారంలో బాగా రాణిస్తారు. కొత్త ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే ఆ అవకాశం లభిస్తుంది. కెరీర్ విషయంలో ఎప్పట్నించో కోరుకున్నది నెరవేరుతుంది. అదృష్టం తోడై వస్తుంది. విదేశాలకు వెళ్లే కోరిక నెరవేరుతుంది.
ధనస్సు రాశి
గురు ఉదయం కారణంగా ఏర్పడే హంస రాజయోగంతో ధనస్సు రాశి వారికి లాభం కలుగుతుంది. ఈ రాశివారికి ఊహించని విధంగా అంతులేని ధనం వస్తుంది. రుణాలు తిరిగి చెల్లించేస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనస్సు రాశివారికి శని దోషం కూడా తొలగిపోతుంది. అందుకే ఈ సమయం ఈ రాశివారికి అత్యంత అనుకూలం. కొత్త వాహనం, కొత్త ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.
మీన రాశి
గురు గ్రహం మీనరాశిలో అస్థిత్వం కోల్పోయి..మేష రాశిలో ఉదయించడం వల్ల మీనరాశి వారికి చాలా లాభదాయకం. గురు గ్రహం ఉదయించడం వల్ల ఏర్పడే హంస రాజయోగం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అభివృద్ధి సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి బంధాలు పటిష్టం చేస్తారు. వ్యాపారంలో ఆర్ధికంగా లాభం కలుగుతుంది.
Also read: Venus Transit 2023: ఫిబ్రవరి 15 నుంచి ఆ 4 రాశులవారు తస్మాత్ జాగ్రత్త, చుట్టుముట్టనున్న సమస్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook