Sun Transit 2023: సూర్య గోచారం ప్రభావంతో ఆ 4 రాశులకు ఊహించని సంపద, ఏప్రిల్ 14 నుంచి మారనున్న దశ
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన గోచారం ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రతికూలమైతే..కొన్ని రాశులకు అనుకూలంగా ఉండనుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Sun Transit 2023: హిందూమతం ప్రకార నవగ్రహాలన్నీ నిర్ణీత పద్ధతిలో గోచారం చేస్తుంటాయి. నిర్ణీత వ్యవధిలో నిర్ణీత రాశిలో మారుతుంటాయి. అదే విధంగా సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై గణనీయంగా ఉంటుంది. ఈ 4 రాశులకు దశ మారిపోనుంది. నోట్లవర్షం కురవనుంది.
సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన మంగళ గ్రహం రాశి మేషంలో ప్రవేశించనన్నాడు. ఈ గోచారం ప్రభావం అన్ని రాశులపై పడనుంది. ముఖ్యంగా 4 రాశులకు అదృష్టం మెరిసిపోనుంది. ఇంట్లో ధన సంపదలు వచ్చి చేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ 4 అదృష్టవంతులైన రాశుల వివరాలు తెలుసుకుందాం..
సూర్య గోచారంతో ఏయే రాశులకు ప్రయోజనం
వృశ్చిక రాశి
సూర్య గోచారం కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి పూర్తి అవకాశాలున్నాయి. సూర్యుడి గోచారం లాభదాయకం కానుంది. వ్యాపారం విస్తృతమౌతుంది. పాత స్నేహితులతో ఆకస్మిక కలయిక ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
మేష రాశి
సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం మేషరాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. పనిచేసే చోట కీలక బాధ్యతలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఫలితంగా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముందు నుంచీ ఉన్న రోగాలు నయమవుతాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.
సింహ రాశి
సూర్యుడి గోచారం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం తోడై నిలుస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో పూర్తిగా విజయం సాధిస్తారు. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలుంటాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లతో పాటు పదోన్నతి కూడా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.
మిథున రాశి
మిథున రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభముంటుంది. ఇచ్చిన అప్పు తిరిగి చేతికి అందుతుంది. ఏదైనా సంపదపై పెట్టుబడి పెట్టవచ్చు. మంచి లాభాలుంటాయి. వ్యాపారులకు లాభాలు గతం కంటే ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సోదర సోదరీమణుల సహకారం పూర్తిగా లభిస్తుంది.
Also read: Mangal Gochar 2023: శత్రు రాశిలో కుజుడు సంచారం.. మే 10 వరకు ఈ రాశులకు అఖండ ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook