Sun Transit 2023 in Aries 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై పడినా..కొన్నింటిపై అనుకూలంగా మరి కొన్నింటిపై వ్యతిరేకంగా ఉంటుంది. ఏప్రిల్ 14న జరగనున్న సూర్య గోచారం ప్రభావం ఆ ఐదు రాశులకు ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన అంటే మరో మూడ్రోజుల్లో మేష రాశిలో ప్రవేశించనున్నాడు.  సూర్య గోచారం కారణంగా 5 రాశులకు మహర్దశ పట్టనుంది. విభిన్న మార్గాల్నించి ఆదాయం వస్తుంది. మేష రాశి 5వ పాదానికి అధిపతి అయినందున ఆ ప్రభావంతో ఈ 5 రాశుల జాతకులకు విజయం లభిస్తుంది. అదృష్టం తోడుగా నిలిచి ధనలాభం కురిపిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ జాతకం వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ 5 రాశులకు ఊహించని ధనలాభం, సంతృప్తి, తెలివితేటలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 


సింహ రాశి:


సూర్యుడి గోచారం కారణంగా ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుందగి. కుటుంబసభ్యులతో కలిసి తీర్ధయాత్ర చేస్తారు. ధనలాభం విశేషంగా ఉంటుంది. డబ్బులు సంపాదించడంలో సఫలులౌతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. 


కర్కాటక రాశి:


సూర్యుడి గోచారం ప్రభావం ఆర్ధికంగా లాభాల్ని అందిస్తుంది. పని నిమిత్తం విదేశాలకు వెళ్లవచ్చు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనిచేసే చోట సహ ఉద్యోగులతో మంచి సంబంధాలుంటాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.


Also Read: Surya budh yuti 2023: మరో 4 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?


వృశ్చిక రాశి:


ఈ రాశి జాతకులకు సూర్యుడి గోచారం ప్రభావం అద్భుతంగా ఉండనుంది. ఆఫీసులో మీ పనిపట్ల ప్రశంసలు లభిస్తాయి. కుండలిలో పదోన్నతి, ఆదాయం పెంపు రాసిపెట్టున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు వేగంగా రాణిస్తారు. 


మేష రాశి:


సూర్యుడి గోచారం ప్రభావంతో మేష రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ నిర్ణయాలు ఆశించిన లాభాలను ఇస్తాయి. కెరీర్‌పరంగా సూర్యుడి గోచారం చాలా ప్రయోజనకరం. ఉద్యోగానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్దికంగా పటిష్టంగా ఉంటారు. 


మిథున రాశి:


సూర్యుడి గోచారం ప్రభావంతో చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి రంగంలో విజయం ఉంటుంది. మీ కష్టం, శ్రమ కారణంగా ప్రశంసలు లభిస్తాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారులైతే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బంది ఎదురు కాదు. ఆరోగ్యం బాగుంటుంది.


Also Read: Grahana Dosham: 18 ఏళ్ల తర్వాత రాహువు యెుక్క వలలో సూర్యుడు... ఈ 3 రాశులవారి జీవితం నాశనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook