Surya Rahu Yuti in Mesha Rashi: 18 ఏళ్ల తర్వాత రాహువు వలలో సూర్యుడు.. ఈ 3 రాశులవారి జీవితాలు నరకమే!

Grahana Dosham after 18 Years: మేషరాశిలో సూర్యుడు మరియు రాహువు కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 07:32 PM IST
Surya Rahu Yuti in Mesha Rashi: 18 ఏళ్ల తర్వాత రాహువు వలలో సూర్యుడు.. ఈ 3 రాశులవారి జీవితాలు నరకమే!

Surya Rahu Yuti in Mesha Rashi 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు ఏప్రిల్ 14న మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే రాహు గ్రహం అదే రాసిలో కూర్చుని ఉన్నాడు. మేషరాశిలో సూర్యుడు మరియు రాహువు కలయిక వల్ల గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో గ్రహణ దోషం చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ గ్రహణ దోషం సమయంలో మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల ధననష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ కూటమి చాలా అశుభకరం. మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. మీరు గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోంటారు. మీరు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

మేషరాశి
ఇదే రాశిలో సూర్యుడు మరియు రాహువు కలయిక జరగబోతుంది. ఈ కూటమి కారణంగా మేషరాశివారికి అనేక సమస్యలు ఎదురకానున్నాయి. పైగా మేషరాశికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. రాహువు మరియు అంగారకుడు శత్రువులు. దీని కారణంగా మిమ్మల్ని వ్యాధులు చుట్టుముట్టే అవకాసం ఉంది. మీ వైవాహిక జీవితం విభేదాలు తలెత్తవ్చు. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు రూబీని ధరించడం మేలు చేస్తుంది. 
Also Read: Surya budh yuti 2023: మరో 4 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?

సింహరాశి 
గ్రహణ దోషం సింహరాశి వారికి అశుభమనే చెప్పాలి. మీ జాతకంలోని తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వ్యాపారులకు ఆర్డర్లు రావు. లక్ ఏ మాత్రం కలిసిరాదు. ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కెంపులు ధరించడం వల్ల మీకు లాభం కలుగుతుంది. 

Also Read: Shukra Grah Vargottam: వర్గోత్తమంగా మారబోతున్న శుక్రుడు.. మరో 48 గంటల్లో ఈ 4 రాశులకు ఐశ్వర్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News