Sun Transit 2023: మరో 5 రోజుల తర్వాత ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీ రాశి ఉందా?
Sun transit 2023: ఈ నెల 16న సూర్యభగవానుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు మూడు రాశులవారికి గరిష్ట ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుుసకుందాం.
Surya Gochar 2023 Effect: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. నెలకొకసారి ఆదిత్యుడు తన రాశిని మారుస్తాడు. మరో 5 రోజుల్లో అంటే జూలై 16న తెల్లవారుజామున 4.59 గంటలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఆగష్టు 17 మధ్యాహ్నం 1.27 వరకు భానుడు కర్కాటకరాశిలో మాత్రమే ఉంటాడు. కర్కాటక రాశి అధిపతిగా చంద్రుడిని భావిస్తారు. పైగా సూర్య, చంద్రులు మిత్రులు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశులవారు బంపర్ బెనిపిట్స్ పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ 3 రాశులకు శుభప్రదం
మేషరాశి
ఈ సమయంలో మేషరాశి వారు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు పురోభివృద్ధి సాధిస్తారు. మీకు ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. మీకు కోరుకున్న ఉద్యోగం లభిసతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది.
మిధునరాశి
ప్రభుత్వ రంగంలో పనిచేసవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అనుకున్న లాభాలను పొందుతారు. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం చేతికి అందుతుంది.
Also Read: Chandra Gochar 2023: గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?
కర్కాటక రాశి
ఇదే రాశిలో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు అనుకూల ఫలితాలను పొందనున్నారు. మీ వైవాహిక జీవితంలోని టెన్షన్స్ అన్నీ దూరమవుతాయి. వ్యాపారులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ లవ్ లైఫ్ బాగుంటుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది.
Also Read: Rajyog in July: జూలై 16న శుభకరమైన యోగం.. ఈ 6 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook