Budhaditya Rajyog 2023 in Kark: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవల బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మరో 5 రోజుల్లో అంటే జూలై 16 సూర్యభగవానుడు అదే రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కర్కాటక రాశికి అధిపతిగా చంద్రుడిని భావిస్తారు. కర్కాటక రాశిలో వీరిద్దరి కలయి వల్ల శుభకరమైన బుధాదిత్య యోగం ఏర్పనడనుంది. ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
మేషం: బుధాదిత్య రాజయోగం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీ కోరికలన్నీ నెరవేరనున్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు భూమి, వాహనం లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథునం: మిథునరాశికి అధిపతి బుధుడు. బుధాదిత్య రాజయోగం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధించనున్నారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు స్థిర చరాస్తులు లభిస్తాయి.
మకరం: బుధుడు, సూర్యుడు కలయిక వల్ల మీరు ఊహించని ధనాన్ని పొందుతారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: Budh Uday 2023: ఈ రోజు నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది... మీ రాశి ఉందా?
కన్య రాశి: బుధాదిత్య రాజయోగం కన్యా రాశి వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
తుల రాశి: బుధాదిత్య రాజయోగం తులారాశి వారికి ధనాన్ని మరియు ప్రమోషన్ రెండింటినీ ఇస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మీనం: బుధాదిత్య రాజయోగం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పెట్టుబడికి ఇదే మంచి సమయం. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మాంగ్లిక్ సమయంలో మీరు పనులు చేయవచ్చు.
Also Read: Chandra Gochar 2023: గజకేసరి రాజయోగంతో ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook