Sun Transit in Pisces 2023: ఇవాళ్టితో ఆ రాశి వారి జీవితమే మారిపోనుంది. ఊహించని ధనలాభం కలగనుంది. సూర్యుడి గోచారం ప్రభావంతో మకరరాశి జాతకం దశ మారిపోతుంది. సూర్యుడి గోచారంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇలా అన్నీ లాభాలే..ఆ రాశివారికి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతరిక్షంలో అన్ని గ్రహాల గోచారమున్నట్టే సూర్యుడు కూడా విభిన్న రాశుల్లో మారుతుంటాడు. మార్చ్ 15వ తేదీన అంటే ఇవాళ సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలో ప్రవేశించాడు. ఏప్రిల్ 14 వరకూ ఈ స్థితి కొనసాగనుంది. సూర్యుడి గోచారం ప్రభావంతో మకర రాశి జాతకులకు చాలా అనువైందిగా ఉంటుంది. కెరీర్ పరంగా ప్రమోషన్ ఆగి ఉంటే ఆ సమస్య తీరిపోతుంది. మీ పనితీరు ఆధారంగా జీతం పెరుగుతుంది. పనిచేసే చోట తోటి సిబ్బందితో మీ సంబంధాలు బాగుంటాయి. ఉన్నతాధికారులతో వ్యవహారం మంచి ఫలితాలనిస్తుంది. 


మకర రాశి జాతక వ్యాపారులు తమ విజయంతో ప్రత్యర్ధులకు బుద్ధి చెబుతారు. వ్యాపారులు మంచి వైఖరితో వ్యాపారం నిర్వహించుకుంటే మంచిది. మీ మాటల్ని సాధ్యమైనంత మృదువుగా ఉంచేందుకు ప్రయత్నించండి. పోటీ పరీక్షలకు హాజరౌతున్న అభ్యర్ధులు విజయ సాధిస్తారు. మంచి ఉద్యోగాలు వస్తాయి. జాయింట్ ఫ్యామిలీలో ఉండేవారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే సంబంధాలు బాగుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కావల్సినవారి నుంచి సహాయం అందుతుంది. వారి సహకారంతో క్లిష్ట సమయాల్ని దాటగలరు. 


ఎప్పట్నించో ఉన్న అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. యోగా, ప్రాణాయామం ద్వారా మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మద్యాహ్నం, రాత్రి భోజనానంతరం వాకింగ్ తప్పకుండా చేయాలి. ఖాళీ కడుపుతో అస్సలుండవద్దు. ఏదో ఒకటి కొద్దిగానైనా తింటుండండి. అప్పుడే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉత్పన్నం కావు.


Also read: Meena sankranti 2023: మీన సంక్రాంతి అంటే ఏమిటి? శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 Android Link  - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook