Sun Transit 2024 In Telugu: గ్రహాలకు పెద్దగా భావించే సూర్యుడు రాశి సంచారం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు జాతకాల్లో శుభప్రదంగా ఉంటే జీవితంలో సంపాదనకు, ఆనందాన్ని ఎలాంటి డోకా ఉండదు. అయితే రెండు రోజుల కింద ఈ సూర్య గ్రహం రాశి సంచారం చేసింది. సూర్యుడు కుజుడు అధిపతిగా వ్యవహరించే మీన రాశిలోకి సంచారం చేసింది. ఆ తర్వాత ఈ గ్రహం మీన రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఏప్రిల్‌ 12 వరకు సూర్యుడు మీన రాశిలోనే సంచార దశలో ఉండబోతున్నాడు. కాబట్టి దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ 27 రోజులు ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై సూర్యుడి అనుగ్రహం:
వృషభ రాశి:

సూర్యుడి అనుగ్రహం కారణంగా వృషభ రాశివారికి ఈ సమయంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంతక ముందు ఆగిపోయిన పనులు కూడా ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే కష్టపడి పని చేసేవారికి ఈ సమయంతో ఊహించని ప్రసంశలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు విదేశాలకు కూడా వెళ్తారు. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా అనుకున్న శుభవార్తలు వింటారు. 


కన్య రాశి:
సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏర్పడి ప్రభావం కన్యా రాశివారిపై కూడా సమానంగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా వ్యాపారాలు చేసేవారు ఇతర దేశాల వారికి ఒప్పందలు జరుపుకునే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే ఇబ్బందులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


కుంభ రాశి:
సూర్యుడి సంచారం కుంభ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఖర్చులు కూడా తగ్గి, ఆదాయం కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. అలాగే కొత్త పనులు ప్రారంభించేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


వీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి:
సూర్యడు మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ సమయంలో సింహ రాశి, వృశ్చిక రాశి వారితో పాటు మరికొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి అనేక ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్న వారు తీవ్రంగా నష్టపోవచ్చు. దీంతో పాటు ఆరోగ్యం కూడా క్షీణించే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి