Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?
Sun Nakshatra Transit: గ్రహాలు రాశులతో పాటు నక్షత్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. జూన్ 22న సూర్యుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఇది రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.
Sun Transit in Ardra Nakshatra: ప్రపంచం మెుత్తానికి వెలుగునిచ్చే దేవుడు సూర్యభగవానుడు. అందుకే ఇతడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఆదిత్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. దీంతోపాటు నక్షత్రాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. జూన్ 22న భానుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ స్టార్ కు అధిపతిగా రాహువును భావిస్తారు. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించిన వెంటనే వాతావరణంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.
రుతుపవనాల ప్రారంభం
సూర్యదేవుడు ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం తొమ్మిదవ రోజున ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 22న సాయంత్రం 5.48 గంటలకు ఆదిత్యుడు ఈ నక్షత్రంలోకి వెళ్తాడు. ఆదిత్యుడి సంచారం రుతుపవనాలకు నాందిగా భావిస్తారు. దీంతో భారీ వర్షాలు కురవడంతోపాటు వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అరుద్ర నక్షత్రంలోకి భాస్కరుడు ప్రవేశించన తర్వాత అర్ఘ్యంతోపాటు ఖీర్ సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
సూర్యుడు మరియు మెర్క్యూరీ కలయిక
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో అరుద్ర నక్షత్రం ఆరోవది. ఈ నక్షత్రానికి శివుడు మరియు రాహువులను దేవతలుగా భావిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా తెలివైనవారు. ఈ నక్షత్రం మిథునరాశికి సంబంధించినది. త్వరలో ఇదే రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలయిక జరగబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది.
ప్రభావం
సూర్యుని నక్షత్రంలో మార్పు కారణంగా మిథునం, కన్య, ధనస్సు మరియు మీనరాశి వారికి భారీగా ధనలాభం ఉంటుంది. వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో మకరం మరియు కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
Also Read: Rahu Transit 2023: మీనరాశిలో సంచరించబోతున్న రాహువు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook