Kark Sankranti 2022 Effect: ఇవాళ సూర్యభగవానుడు రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మిథునరాశిలో ఉన్న సూర్యుడు జూలై 16, 2022 రాత్రి 10:56కి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని కర్క సంక్రాంతి అంటారు. అక్కడే ఆగస్ట్ 17 వరకు ఉంటాడు. సూర్య సంచారం ప్రభావం మెుత్తం 12రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటే, మరికొన్ని రాశులకు నష్టదాయకంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం(Aries)- కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా వీరి జీవింతలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇతరులతో గొడవలు పెట్టుకోవచ్చు. చెడు వార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. కొత్త కారు కొనుకోలు చేసే అవకాశం ఉంది. 


వృషభం (Taurus)- సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. విదేశాల నుండి లాభం ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది.


మిథునం (Gemini)- ఈ రాశివారికి ధనం లాభిస్తుంది. కంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. ఏదైనా వివాదంలో చిక్కుకుంటే కోర్టుకు వెళ్లకుండా బయట పరిష్కరించుకోవడానికే ప్రయత్నించండి. 


కర్కాటక రాశి (Cancer) -  కర్కాటక రాశివారికి ఇది చాలా మంచి సమయం. అయితే ఆరోగ్య సమస్యలు వెంటాడవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల్లో చురకుగా వ్యవహారిస్తారు. 


సింహం (Leo) - ఈ కాలంలో మీరు బాగానే సంపాదిస్తారు. అనారోగ్యానికి  గురయ్యే అవకాశం ఉంది. కష్టపడి పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది. 


కన్య (Virgo)- మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు.


తుల (Libra)- కొత్త జాబ్ వస్తుంది. పెద్ద పదవి లభిస్తుంది. శత్రువులు ఓడిపోతారు. మీరు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుతారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


వృశ్చికం (Scorpio)- వీరికి అదృష్టం తోడవుతుంది. ఈ కాలంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.  మతపరమైన పనుల్లో చురుకుగా ఉంటారు. 


ధనుస్సు (Sagittarius)- మీరు ఊహించని ఫలితాలు చూస్తారు. మీకు చెడు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆఫీస్ లో మీపై ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉంది.  వివాదాలను సులభంగా పరిష్కరించుకుంటారు.


మకరం (Capricron)- వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. వివాదాల్లో ఇరుక్కోవచ్చు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. బంధువులతో హాయిగా ఉంటారు.


కుంభం (Aquarius)- ఈ రాశివారికి ఇది చాలా మంచి సమయం. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీ పని సులభంగా పూర్తవుతుంది. లవ్ లైప్ అంతగా బాగుండదు. 


మీనం (Pisces)- ఊహించని ఫలితాలు వస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటి పెద్దల మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయం మీకు సంతోషంగా ఉంటుంది.


Also Read: Sravana First Chaturthi: నేడే శ్రావణ చతుర్థి.. శుభ ముహూర్తం, వినాయక వ్రత విధానం గురించి తెలుసుకోండి 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook