Sravana First Chaturthi: నేడే శ్రావణ చతుర్థి.. శుభ ముహూర్తం, వినాయక వ్రత విధానం గురించి తెలుసుకోండి

Sankashti Chaturthi 2022: ప్రతి నెల చతుర్థి తిథి వినాయకుడికి అంకితం చేయబడింది. ఈరోజు శ్రావణ మొదటి చతుర్థి. ఈ రోజున శుభముహూర్తంలో గణేశుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 10:12 AM IST
  • శ్రావణ చతుర్థి రోజున గణేశుడిని పూజిస్తారు
  • శుభ ముహూర్తం, వ్రత విధానం గురించి తెలుసుకోండి
Sravana First Chaturthi: నేడే శ్రావణ చతుర్థి.. శుభ ముహూర్తం, వినాయక వ్రత విధానం గురించి తెలుసుకోండి

Sravana Sankashti Chaturthi 2022: శ్రావణ మాసంలో వచ్చే చతుర్థిని సంకష్టి చతుర్థి లేదా గణేష్ చతుర్థి అంటారు. ప్రతి నెలలో రెండు చతుర్థులు ఉంటాయి. ఇవి వినాయకుడికి (Lord Ganesh) అంకితం చేయబడ్డాయి. ఇవాళే అంటే జూలై 16 మధ్యాహ్నాం నుండి చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడబోతున్నాయి. సంకష్టి చతుర్థి (Sankashti Chaturthi 2022) రోజున మొదటగా గణేశుడిని పూజిస్తారు. రాత్రికి చంద్రుని దర్శనం చేసుకుని అనంతరం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే వ్రతం సంపూర్ణమవుతుంది. 

శుభ ముహూర్తం
హిందువులు ఏ పూజ లేదా కార్యక్రమం చేసిన మెుదటగా వినాయకుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తేదీ జూలై 16వ తేదీ మధ్యాహ్నం 01.27 నుండి జూలై 17వ తేదీ ఉదయం 10.49 వరకు ఉంటుంది. ఈ రోజున ఆయుష్మాన్ యోగం ఉదయం నుండి రాత్రి 08:50 వరకు మరియు సౌభాగ్య యోగం ఈ రోజు రాత్రి 08.50 గంటల నుండి జూలై 17వ తేదీ ఉదయం 05:49 వరకు ఉంటుంది. ఈరోజు రాత్రి 09:49 నుండి గణేశుడికి అర్ఘ్య సమయం ప్రారంభమవుతుంది మరియు చంద్రోదయం తర్వాత ఎప్పుడైనా అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. 

పూజా విధానం
>> గజానన సంకష్ట చతుర్థి నాడు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు దుస్తులు ధరించండి. పూజగదిని శుభ్రం చేయండి. దీని తరువాత నీరు, అక్షింతలు మరియు పువ్వులు తీసుకొని పూజా ప్రారంభించండి.
>>మంచి ముహూర్తంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి. గణపతికి జలాభిషేకం చేసి వస్త్రాలు సమర్పించండి. గణపతికి చందనం తిలకం పూయండి. 
>> పూజ సమయంలో ఎర్రటి పూలు, పండ్లు, దుర్వ, తమలపాకులు, ఏలకులు, ధూపం, దీపం మరియు సువాసనలను సమర్పించండి. దీని తరువాత వినాయకుడికి బూందీ లడ్డూలను పెట్టండి. అనంతరం  గణేష్ చాలీసా మరియు వ్రత కథను చదవండి. గణేశుడికి తులసిని సమర్పించడం మర్చిపోవద్దు.
>> ఈ రోజున గణేష్ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వినాయకుడికి హారతి ఇచ్చి పూజను ముగించండి.  గణేశుడు ముందు నెయ్యి దీపం వెలిగించండి.
>> రోజంతా పండ్లు తింటూ... గణేశుడిని పూజించండి. చంద్రోదయం తర్వాత రాత్రికి చంద్రుని పూజించి ఆర్ఘ్యం సమర్పించండి. .
>> చంద్రుడిని పూజించిన తరువాత జీవితంలోని అన్ని కష్టాలను పోగొట్టమని గణేశుడిని ప్రార్థించండి. 
>> ఈ రోజున తియ్యని ఆహారంతో ఉపవాసం ముగించండి. చాలా చోట్ల సూర్యోదయం తర్వాతే సంకష్ట చతుర్థి  ఉపవాసం విరమిస్తారు. 

Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే; వీరికి డబ్బే డబ్బు.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News