Sun Transit in Gemini 2022:  జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు.. తండ్రి, విజయం, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు, ఆరోగ్యం, గౌరవం మరియు విశ్వాసానికి కారకుడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి తన కెరీర్‌లో చాలా విజయాలను అందుకుంటాడు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాడు. అతడికి పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సూర్యుడు జూన్ 15న తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. సూర్యుడు వృషభరాశిని విడిచి మిథునరాశిలో (Sun Transit in Gemini 2022) ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి సూర్య సంచారం గొప్ప ప్రయోజనాలనిస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి, మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తిలో లాభాలు ఉంటాయి. డబ్బును ఎక్కడి నుండైనా స్వీకరించవచ్చు, మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. 


సింహం (Leo): సింహ రాశి వారికి సూర్యుడు రాశి మారడం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది. డబ్బును చాలా మార్గాల ద్వారా సంపాదిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ ఖర్చులు తీరుతాయి. పొదుపు కూడా ఉంటుంది. సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. జాబ్ లో ప్రమోషన్ ఉండవచ్చు.  ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది. విడిపోయే పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అది దూరమవుతుంది. మొండితనం మానుకోండి. 


కన్య (Virgo): మిథునరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో కన్యా రాశి వారు తమ కెరీర్‌లో చాలా ప్రయోజనాలను పొందుతారు. మీరు పురోగతిని పొందుతారు. పనిలో విజయం ఉంటుంది. పదోన్నతులు పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. కొందరికి కొత్త ఉద్యోగం కూడా రావచ్చు. ఈ సమయాన్ని మంచి పనుల్లో వినియోగించుకుంటే మంచిది. 


Also Read: Nirjala Ekadashi 2022: నిర్జల ఏకాదశి వ్రతం పాటించేవారు ఈ తప్పులు చేయకండి! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook