Nirjala Ekadashi Vrat 2022 Rules: హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని ఏకాదశులైతే చాలా ప్రత్యేకం. ఇందులో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా.. వ్యక్తికి సంవత్సరంలోని 24 ఏకాదశి ఉపవాసాలను ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉపవాసం చేస్తారు. ఇవాళే (జూన్ 10) ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
నీరు తాగకుండా ఉపవాసం..
నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఉపవాసం జూన్ మాసం..పైగా వేసవి కాలంలో వస్తుంది. సాధారణంగా మండు వేసవిలో నీళ్లు, షర్బత్‌తో పాటు అనేక రకాల డ్రింక్స్ తాగినా ఎండ వేడిని తట్టుకోలేం.. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటల పాటు నీళ్లు తాగకుండా ఉండడం చాలా కష్టం. ఈ వ్రతంలో భాగంగా విష్ణువు-తల్లి పార్వతిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీమాత అనుగ్రహంతో జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.
ఈ నియమాలు పాటించండి
** నిర్జల ఏకాదశికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి, అప్పుడే ఈ వ్రతానికి పూర్తి ఫలం లభిస్తుంది.
** నిర్జల ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. ఉపవాసానికి ముందు రోజు రాత్రి నుంచి అలాగే ఉపవాసం ఉన్న మరుసటి రోజు రాత్రి వరకు అన్నం తినకూడదు.
** ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదని గుర్తుంచుకోవాలి. వారు పానీయాలు మరియు పండ్లు మాత్రమే తీసుకోవాలి.
** ఆ రోజున ఉపవాసం లేని వారు అన్నం, పప్పు, ముల్లంగి, బెండకాయలు, బీన్స్ వంటి ఆహారాన్ని తినకూడదు.
** ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారం మరియు మద్యం సేవించవద్దు.
** నిర్జల ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించండి.
Also Read: Lucky Women: ఆ గుర్తులున్న మహిళల అదృష్టం అంతులేని సంపద తెచ్చిపెడుతుందట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Nirjala Ekadashi 2022: నిర్జల ఏకాదశి వ్రతం పాటించేవారు ఈ తప్పులు చేయకండి!