Surya Rashi Parivartan 2022: సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. నిన్న అంటే ఆగస్టు 17న సూర్యుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదమైనది. సూర్యుని ఈ మార్పు నెల రోజులపాటు ఈ రాశులకు అపారమైన డబ్బును, కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులకు శుభప్రదం
సింహరాశిలో సూర్యుని ప్రవేశం ఈ 4 రాశులకు చాలా మేలు చేస్తుంది. ఈ సూర్య సంచారం మేష, కర్కాటక, సింహ, మీన రాశుల వారికి అపారమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. వీరు కెరీర్ లో పురోగతి సాధించడంతోపాటు అష్టఐశ్వర్యాలను పొందుతారు. 


డబ్బు సంపాదించడానికి మార్గాలు:
>> జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి వేగంగా అభివృద్ధి చెందుతాడు మరియు చాలా డబ్బు సంపాదిస్తాడు. 
>> మీరు సూర్యుడిని బలపరచడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.  జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే,.. ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే ఆవుకి బెల్లం, రోటీ తినిపించండి. ఈ రెమెడీని రోజూ చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
>> సూర్యుడు కూడా తండ్రికి కారక గ్రహమే. అందువల్ల, ప్రతిరోజూ మీ తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి. దీని కారణంగా సూర్యుడు బలపడి శుభ ఫలితాలను ఇస్తాడు.
>> ఉన్నత హోదా పొందడానికి, ప్రతి ఆదివారం తెల్లవారుజామున స్నానం చేసి.. ఎరుపు రంగు దుస్తులు ధరించి, 'ఓం హ్రాన్ హ్రీం హ్రౌన్స్: సూర్యాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఈ జపాన్ని కనీసం 3 లేదా 5 సార్లు జపించండి. 
>> రోజూ ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆదివారాలు ఉప్పు తినకుండా ఉపవాసం ఉండండి. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది. 


Also Read: మరో 3 రోజుల్లో బుధుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారికి చెడు రోజులు మెుదలు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook