Sun Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం పరివర్తనం చెందినప్పుడు రాశి గ్రహాల ప్రకారం జాతకం మారిపోతుంటుంది. సూర్యుడు సింహరాశి ప్రవేశం కారణంగా మకరరాశికి ఇబ్బందులు తప్పవంట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవగ్రహాలన్నీ తమ మత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి. అటు సూర్యుడు కూడా తిరుగుతుంటాడు. ఏడాదిలో ఒక నెల పాటు ఒక్కొక్క రాశిలో ఉండటం సూర్యుడి ప్రత్యేకత. ఈసారి ఆగస్టు 17న సూర్యుడు తన సింహరాశిలో ప్రవేశించనున్నాడు. సింహరాశిలో ప్రవేశిస్తూనే మరింత బలోపేతం కానున్నాడు. సింహరాశిలో సూర్యుడి నక్షత్రం ఉత్తర ఫాల్గుణం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సూర్యుడిని స్వాగతించేందుకు బుధుడు ఆ రాశిలో ముందు నుంచే ఉన్నాడు. ఈ ప్రభావం మకరరాశిలవారిపై పడుతుంది. మకరరాశి జాతకుల ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. ఊహించని ఖర్చులు కూడా ఎదురౌతాయి.


ఆరోగ్యరీత్యా నిర్లక్ష్యం వహించకూడదు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా నిద్రించి..త్వరగా నిద్రలేవాలి. లేచిన వెంటనే కాస్సేపు యోగా సాధన చేయాలి. శారీరకంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. అజీర్ణం, పైల్స్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అందుకే తినే ఆహారంప ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచూ జ్వరం రావచ్చు. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామికి కూడా శారీరకంగా కష్టం ఎదురుకావచ్చు. అయితే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాదు. 


అరెస్టులు, కోర్టు కేసులు తప్పవా


మకరరాశివారికి  ఈ సమయంలో శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి ఘర్షణకు పాల్పడినా సంయమనం పాటించాలి. ఎందుకంటే మీకు సమయం అనుకూలంగా లేదు. గతంలో మీరు చేసిన పనులకు ప్రతిఫలమే ఇదంతా. ప్రభుత్వపరంగా ఏర్పడిన సమస్యకు సమాధానంగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి అరెస్టులు, కోర్టు కేసులు ఎదురుకావచ్చు.


Also read: Janmashtami 2022: ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. కృష్ణాష్ణమి నాడు ఈ 5 వస్తువులను కొనండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook