Sun Transit 2022: గ్రహాల రాశి పరివర్తనం ఎప్పుడూ ఆ వ్యక్తి జీవితంలో శుభ, అశుభ పరిణామాలకు దారితీస్తుంది. సూర్యుడి సింహరాశిలో ఉండటం వల్ల..కొన్ని రాశుల జాతకమే మారిపోనుంది. ఎప్పట్నించి, ఎలా మారుతుందనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి మారినప్పుడు ఆ ప్రభావం దాదాపు అన్ని రాశులపై స్పష్టంగా పడుతుంది. కొన్ని రాశులపై అనుకూలంగా..మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. గ్రహాలకు రాజైన సూర్యుడి సెప్టెంబర్ 5న సింహరాశిలో ప్రవేశించాడు. సెప్టెంబర్ 17 వరకూ అదే రాశిలో ఉండనున్నాడు. ఆ తరువాత సూర్యుడి సింహ రాశి నుంచి కన్యా రాశిలో మారనున్నాడు. సూర్యుడి సింహరాశి ప్రవేశం వల్ల కొన్ని రాశుల జాతకమే మారిపోతోంది. జ్యోతిష్యం ప్రకారం కుండలిలో సూర్యుడు శుభస్థితిలో ఉంటే..ఆ వ్యక్తికి అదృష్టం తిరగరాస్తుందట.


ఈ నేపధ్యంలో సింహరాశిలో సూర్యుడి ప్రవేశం వల్ల సెప్టెంబర్ 17 వరకూ మూడు రాశుల అదృష్టం పూర్తిగా మారిపోనుంది. ఈ సమయంలో ఈ నాలుగు రాశులవారికి ఏ విధమైన సమస్యలు, ఆటంకాలు ఎదురుకావు. అంతేకాదు..ఈ రాశులవారికి మోడువారిన అదృష్టం తిరిగి వికసిస్తుంది. లక్ష్మీదేవి ఒక్కసారిగా కటాక్షం కల్గిస్తూ..అంతులేని ధన సంపదనలు ప్రసాదిస్తుంది. 


మిధున రాశి జాతకులకు..సూర్యుడి సింహరాశి ప్రవేశం కారణంగా..అంతా శుభం జరుగుతుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మిత్రుడి నుంచి ఆర్ధికంగా తోడ్పాటు లభించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫలితంగా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వాయిస్ ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి.


సింహరాశి వారికి అంతా అనుకూలమే. సూర్యుడి సింహరాశి ప్రవేశం వల్ల చాలా రకాలుగా లాభాలు కలుగుతాయి.ఈ సమయంలో వ్యాపారం పెరిగి..లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో సుఖ శాంతులు లభిస్తాయి. సంతానానికి సంబంధించి గుడ్‌న్యూస్ లభిస్తుంది. 


వృశ్చిక రాశివారికి కూడా చాలా అనుకూలమైన సమయం ఇది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాతోపాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఉద్యోగమార్పు ఉండటమే కాకుండా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహకారంతో అన్నిపనులు పూర్తి చేయగలుగుతారు. 


ధనస్సు రాశివారికి అంతా శుభమే. ఈ రాశి జాతకులకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితం మెరుగుపడుతుంది. జీవితం సుఖమయంగా ఉండి..అన్ని పనులు పూర్తవుతాయి. 


Also read: Navratri 2022: శరన్నవరాత్రులు ఎప్పుడు.. శుభ ముహూర్తం ఏ సమయంలో.. నవరాత్రుల్లో ఏ రోజున ఏ పూజ చేస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook