Navratri 2022: శరన్నవరాత్రులు ఎప్పుడు.. శుభ ముహూర్తం ఏ సమయంలో.. నవరాత్రుల్లో ఏ రోజున ఏ పూజ చేస్తారు..

Navratri 2022 Date Shuba Muharat and Durga Puja : ఈ ఏడాది శరన్నవరాత్రులు ఎప్పుడొస్తున్నాయి... ఏ రోజున అమ్మవారు ఏ రూపంలో కొలువుదీరనున్నారు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2022, 03:25 PM IST
  • శరన్నవరాత్రులు ఎప్పుడంటే..
  • సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు
  • అమ్మవారు ఏ రోజున ఏ రూపంలో కనిపిస్తారంటే..
Navratri 2022: శరన్నవరాత్రులు ఎప్పుడు.. శుభ ముహూర్తం ఏ సమయంలో.. నవరాత్రుల్లో ఏ రోజున ఏ పూజ చేస్తారు..

Navratri 2022 Date Shuba Muharat and Durga Puja : దసరా అంటే హిందువులకు పెద్ద పండగ. దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా సమయంలోనే శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో దుర్గా దేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ పండగను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విభిన్న పద్దతుల్లో జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో ఏ రోజున అమ్మవారు ఏ రూపంలో కొలువై ఉంటారో.. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నవరాత్రుల శుభ ముహూర్తం :

శరన్నవరాత్రి ప్రారంభం, ఘటస్థాపన శుభ ముహూర్తం: 26 సెప్టెంబర్ సోమవారం ఉదయం 06:20 గం. నుండి 10:19 గం. వరకు
శుక్ల పక్ష ప్రతిపద ప్రబంధ - 26 సెప్టెంబర్ సోమవారం ఉదయం 3:24 గం. నుండి 27 సెప్టెంబర్ ఉదయం 03:08 గం. వరకు
అభిజిత్ ముహూర్తం- 26 సెప్టెంబర్ సోమవారం ఉదయం 11:54 గం. నుండి 12:42 గం. వరకు

నవరాత్రులు.. అమ్మవారి రూపాలు.. ఏ రోజున ఏ పూజ చేయాలంటే.. :

నవరాత్రుల మొదటి రోజు - సోమవారం 26 సెప్టెంబర్ 2022- ప్రతిపాద, ఘటస్థాపన, మా శైలపుత్రి పూజ
నవరాత్రుల రెండో రోజు - మంగళవారం 27 సెప్టెంబర్ 2022 - బ్రహ్మచారిణి పూజ
నవరాత్రుల మూడవ రోజు- బుధవారం 28 సెప్టెంబర్ 2022 -  చంద్రఘంట పూజ
నవరాత్రుల నాలుగవ రోజు - సెప్టెంబర్ 29 గురువారం- మా కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం
నవరాత్రుల ఐదవ రోజు - శుక్రవారం 30 సెప్టెంబర్-పంచమి, మా స్కందమాత పూజ
నవరాత్రుల ఆరో రోజు - అక్టోబర్ 1 శనివారం, 6వ- షష్ఠి, మాతా కాత్యాయని పూజ
నవరాత్రుల ఏడవ రోజు - ఆదివారం 2 అక్టోబర్ 2022- సప్తమి, మా కాలరాత్రి పూజ
నవరాత్రుల 8వ రోజు - సోమవారం 3 అక్టోబర్ 2022- దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ, మహానవమి
నవరాత్రుల తొమ్మిదో రోజు - మంగళవారం 4 అక్టోబర్ 2022- మహానవమి, శరన్నవరాత్రుల పరణ
శరన్నవరాత్రుల పదో రోజు - బుధవారం 5 అక్టోబర్ 2022- దశమి, దుర్గా దేవీ నిమజ్జనం

Also Read: MLA Jagga Reddy:ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ లో కలవరం   

Also Read: నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా.. బీజేపీ లీడర్లను ఆటాడుకుంటున్న నెటిజన్లు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News