Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తుంటుంది. దీనివల్ల అన్ని రాశులపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావం పడుతుంటుంది. ఆగస్టు 17న సింహరాశిలో సూర్యుుడు ప్రవేశించడం వల్ల ఆ మూడు రాశులకు మంచి రోజులు ప్రారంభమయ్యాయంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించినా నెలరోజులు కచ్చితంగా ఉంటాడు. అంటే ప్రతి నెలా సూర్యుడి గోచారం లేదా రాశి పరివర్తనం తప్పకుండా ఉంటుంది. అందుకే ప్రతి రాశివాళ్లు నెల నెలా జాతకం చూసుకుంటుంటారు. ఆగస్టు 17న సింహరాశిలో ప్రవేశించిన సూర్యుడు సెప్టెంబర్ 17 వరకూ అందులోనే ఉంటాడు. ఫలితంగా మేషం, వృషభం, మిధున రాశులకు మంచి రోజులు మొదలయ్యాయి. ఈ మూడు రాశులవారికి వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. 


సూర్యుడి సింహ రాశి ప్రవేశం కారణంగా వృషభ రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉండనుంది. ఎక్కడైనా ఎప్పుడైనా అప్పు తీసుకుని ఉంటే ఆ అప్పుని తిరిగి చెల్లించేయాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అంటే రుణాల చెల్లింపుకు ఈ సమయం అనువైందంటున్నారు. పెట్టుబడులకు సరైన సమయమిది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు కానీ చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడవచ్చు.


సూర్యుడు సింహ రాశిలో సెప్టెంబర్ 17 వరకూ ఉండటంతో మిధున రాశి జాతకులకు కూడా సెప్టెంబర్ 17 వరకూ అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంచి సమయం. లాభాలు ఆర్జించవచ్చు. అయితే చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. పెట్టుబడి పెట్టేముందు అందులో ఉన్న లాభనష్టాలు బేరీజు వేసుకోవాలి. ఇనుము వ్యాపారం చేసేవారికి లాభాలు ఎక్కువగా రావచ్చు. ఈ జాతకం వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే దీర్గకాలంగా ఉండే సమస్యలు తొలగిపోవచ్చు.


సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా సూర్యుడి మేష రాశి జాతకుల అదృష్టం పండించనున్నాడు. వ్యాపారంలో గణనీయమైన వృద్ది ఉంటుంది. వివిధ మార్గాల్నించి లాభాలు వస్తాయి. వ్యాపారం విస్తరించేందుకు ఇదే మంచి సమయమంటున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కూడా అనువైన సమయం.


Also read: Budhaditya Rajyogam: బుధాదిత్య రాజయోగంతో సెప్టెంబర్ 16 వరకూ ఈ మూడు రాశులకు తిరుగులేదిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook