Budhaditya Rajyogam: బుధాదిత్య రాజయోగంతో సెప్టెంబర్ 16 వరకూ ఈ మూడు రాశులకు తిరుగులేదిక

Budhaditya Rajyogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి మారినప్పుడు చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటే..మరికొన్ని రాశులపై పూర్తిగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది రాశిని బట్టి..గ్రహ గోచారాన్ని బట్టి ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2023, 01:25 PM IST
Budhaditya Rajyogam: బుధాదిత్య రాజయోగంతో సెప్టెంబర్ 16 వరకూ ఈ మూడు రాశులకు తిరుగులేదిక

Budhaditya Rajyogam: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి.  ప్రతి గ్రహానికి ఓ రాశితో ముడిపెడుతూ గ్రహాల కదలికను అత్యంత మహత్యంగా భావిస్తారు. గ్రహాలు రాశి మారడం వల్ల ఆ ప్రభావం మనిషి జీవితంపై నేరుగా ఉంటుందంటారు జ్యోతిష్య పండితులు. ఆగస్టు 17న సూర్యుడి సింహ రాశిలో ప్రవేశించడంతో ఏం జరగనుందో తెలుసుకుందాం..

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు నాలుగు రోజుల క్రితం అంటే ఆగస్టు 17వ తేదీన సింహ రాశిలో ప్రవేశించాడు. సూర్యుడు ప్రతి రాశిలోనూ నెల రోజులు కచ్చితంగా ఉంటాడు. అంటే సెప్టెంబర్ 17 వరకూ సింహరాశిలో సూర్యుడు కొనసాగనున్నాడు. ఇక గ్రహాల్లో రాజకుమారుడిగా భావించే బుధుడు ఇప్పటికే సింహరాశిలో ఉండటంతో సూర్యుడు, బుధ గ్రహాల యుతితో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది  మూడు రాశులవారికి విశేషమైన, అంతులేని లాభాల్ని కల్గించనుంది. బుధాదిత్య రాజయోగం అంటే జ్యోతిష్యం ప్రకారం అత్యంత శుభప్రదమైన పరిణామం. అందుకే మూడు రాశులవారిపై ఆకశ్మిక ధనలాభం కల్గించనుంది. ఈ  మూడు రాశులవారికి ఊహించని మార్గాల్నించి డబ్బులు అందనున్నాయి. 

వృషభ రాశి జాతకులకు ప్రస్తుతం అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే బుధాదిత్య రాజయోగం ప్రభావం ఈ రాశిపై ఉంటుంది. ఈ సమయంలో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎందులోనైనా పెట్టుబడులు పెడితే కచ్చితంగా లాభాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారంలో, పనిచేసే చోట ఆర్ధికంగా లబ్ది పొందుతారు. 

సూర్యుడు సింహ రాశిలో ప్రవేశించడం, ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల ఈ రాసివారికి కలిగే లాభాలకు లెక్కలేదు. ఊహించని మార్గాల్నించి లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. కేవలం ఆర్ధికంగానే కాకుండా రాజకీయంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా లెక్కకు మించి లాభాలుంటాయి.  జీవిత భాగస్వామితో సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి ఆరోగ్యం బాగుంటుంది. 

జ్యోతిష్యం ప్రకారం బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మేష రాశి జాతకులపై ధనరాజ యోగం కలుగుతుంది. అంటే లెక్కలేనంతగా డబ్బులు వచ్చిపడతాయి. ఉద్యోగులకైతే పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. విదేశాల్లో చదవాలనుకునేవారి కోరిక నెరవేరవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Also read: Mercury Retrograde 2023: బుధుడి తిరోగమనంతో ఆ 4 రాశులు తస్మాత్ జాగ్రత్త, ఆగస్టు 24 నుంచి వెంటాడనున్న కష్టాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News